Asianet News TeluguAsianet News Telugu

చెన్నై బాధితురాలికి సీఎం చంద్రబాబు అండగా నిలవాలి-కేతిరెడ్డి జగదీశ్ రెడ్డి

  • తనకు జరిగిన అన్యాయంపై ఏపీ సీఎం స్పందించాలని కోరిన చెన్నై బాధితురాలు లావణ్య 
  • చెన్నై లో కత్తిపోట్లకు గురైన విజయవాడకు చెందిన బాధితురాలు లావణ్య
  • ఐటీ ఉద్యోగినిగా పనిచేస్తున్న లావణ్యపై  దుండగుల దాడి.. అత్యాచారం
kethireddy visitation at chennai telugu victim lavanya

చెన్నై నగరం లో ఇటీవల ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ కు చేిందిన ప్రైవేటు ఇ.టి కంపెనీ .నవలూరు లో సాఫ్టువేర్ ఇంజినీర గా పని చేయు చున్న తెలుగు సంతతికి చె0దిన లావణ్య పై దుండగులు రాత్రి పూట దాడి చేసి ఆమె పై హత్యాచారని  పాల్పడినారు.ప్రాణపయ  స్థితిలో ఉన్న అమెను చెన్నై లోని గ్లోబల్ హాస్పిటల్ నందు చేర్చటం జరిగింది.. చికిత్స అనంతరం ఇప్పుడు ఆమె  కోలుకున్నది ..ఈ రోజు లావణ్యను గ్లోబల్ హాస్పిటల్ నందు తమిళనాడు తెలుగు నాయకులు .తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు. కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి.  టమ్స్ వవసస్థాపకుడు గొల్లపల్లి ఇజ్రాయెల్ ,పి.పాలకొండయ్యే కలిసి ఆ అమ్మాయి ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండాలని కోరుకుంటూ తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదం అయిన లడ్డూను అమైకు  ఇచ్చారు.వారి కుటుంభసభ్యులకు తమ సానుభూతిని, సంఘీభావం ను తెలిపారు.

 

కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ "చైన్నై పోలీస్ కమిషనర్ ను.పోలీసు అధికారులను ఆయన అభినందించారు. ముఖ్యంగా ఈ .ఓ.ఎం.ఆర్ .ప్రాంతంలో చాలా సంఘటనలు ఇలాంటివి జరుగుతున్నాయని, పరాయి రాష్ట్రాల నుంచి పొట్టకూటి కొరకు,విద్య కొరకు వచ్చిన వారిపై ఇలాంటి అత్యాచారాలకు పాల్పడుతున్నారని తమ దృష్టికి వచ్చిందని కేతిరెడ్డి తెలిపారు. అయితే కొంతమంది నిర్భయంగా ఎదుర్కొంటున్నారని ,కొందరు ఉద్యోగులు,విద్యార్థులు ,అన్ని వదులుకొని ,ఫిర్యాదులు చేయకుండా వారి సొంత ఊర్లకు వెళ్లిపోతున్నారని.ఇది ఒక చెన్నై లో మాత్రమే లేదని దేశవ్యాప్తంగా ఉన్న నగరాల్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని,ముఖ్యంగా తెలుగు వారి పై దాడులు ఎక్కువ అయ్యాయని.ఇటీవల సత్యభామ యూనివర్సిటీ లో రాగమౌళిక రెడ్డి ఆత్మహత్య కూడా ఈ కోవలోనిదేననన్నారు. 

ఇలాంటి కొన్ని వందల సంఘటనలు గత కొన్ని  రోజులు గా జరుగుతున్నాయని ,కొన్ని వెలుగులోకి వస్తున్నా..కొన్ని మాత్రం పరువును కాపాడుకునే ప్రయత్నంలో తెరమరగు అవుతున్నాయని కేతిరెడ్డి అన్నారు. తమిళనాడు లో తెలుగు వారి సమస్యల మీదే కొన్నేళ్లుగా పోరాటాలు చేస్తున్నామని, అంతేకాక విద్యాసంస్థలలో,ఉద్యోగ సంస్థ లలో పనిచేసే తెలుగువారి న్యాయమైన కోర్కెల కొరకు  పోరాటాలు చేయుటకు మేము సిద్ధంగా ఉన్నామని, అందరికీ అండదండగా ఉంటామని. ఇది తమిళనాడు కదా మాకు ఎవ్వరు లేరు అని అనుకోవద్దని.. అవసరమైతే తెలుగువారి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని కేతిరెడ్డి స్పష్టం చేశారు.  తమిళనాడులోని తెలుగువారెవరూ ఆభద్రతాభావంతో ఉండొద్దని మీకు మేము అండగా ఉంటామని తెలుగు ఉద్యోగులకు ,అన్ని డీమ్డ్ యూనివర్సిటీ లలో చదువుకుంటున్న విద్యార్థుల కు తెలుగు నాయకులు భరోసా ఇచ్చారు .

చెన్నై సిటీ బాగా పెరిగింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం  చెన్నై ను రెండు కమిషనరేట్ చేయలని , ఓ.ఎం.ఆర్ .లో ఎక్కువ ప్రకటన ల ద్వారా ప్రజలకు హైచరికలు చేయాలనీ , దానితో పాటు హై సెక్యురిట్ జోన్ గా ఓ.ఎం.ఆర్ ను గుర్తించి పోలీస్ వవస్థ ను బలోపేతం చేసేందుకు కృషి చేయాలని ఈ ప్రాంతంలో ఉన్న .పబ్స్ ,శనివారం. ఆదివారం. మాత్రమే ఉండే విధంగా చర్యలు చేపట్టాలని , ఇలాంటి సంఘటన లు తిరిగి పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ని ,హోమ్ సెక్రటరీ ని తమిళనాడు రాష్ట్ర డి. జి. పి. ని కేతిరెడ్డి కోరారు. అవసరమైతే ప్రభుత్వ అధినేతలను కలిసి ఆ దిశగా అడుగులు వేయాలని  కోరుతామని తెలిపారు.

బాధితురాలు లావణ్య,  వారి కుటుంబ సభ్యులు..ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించి... తమిళనాడు ముఖ్యమంత్రితో మాట్లాడి నేరస్తులకు కఠినంగా  శిక్షించుటకు చర్యలు చేపట్టాలని కోరారు. సీఎం చంద్రబాబు స్పందించి నేనున్నాను అనే భరోసా ఇవ్వాలని బాధితురాలు కోరిందని కేతిరెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో తమిళనాడులోని యూనివర్సిటీ లలో తెలుగు విద్యార్థుల పై వివక్ష తదితర విషయాలను ఇక్కడి ప్రభుత్వంతో మాట్లాడి ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండుటకు చర్యలు చేపట్టాలని కేతిరెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు.

Follow Us:
Download App:
  • android
  • ios