వర్మ సినిమా ఆపేస్తే తన సినిమా ఆపేస్తాడట.. ఎన్టీఆర్ పై ఏం భక్తి

వర్మ సినిమా ఆపేస్తే తన సినిమా ఆపేస్తాడట.. ఎన్టీఆర్ పై ఏం భక్తి

ఎన్టీఆర్ జీవితం ఆధారంగా ఇప్పటికే మూడు సినిమాలు ప్రకటించారు ఫిల్మ్ మేకర్స్. వీటిలో వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ వర్సెస్ కేతిరెడ్డి లక్ష్మీస్ వీరగ్రంథం అనే రెండు సినిమాలది మాత్రం ప్రత్యేకత. తేజ దర్శకత్వంలో బాలకృష్ణ తెరకెక్కించచబోయే ఎన్టీఆర్ బయోపిక్ లో అన్నగారి లైఫ్ లోని పాజిటివ్ అంశాలు కథాంశంగా మూవీ తెరకెక్కనుంది. మిగిలిన రెండింటింలో వర్మ సినిమాపై భారీగా హైప్ క్రియేటైంది. దీనికి కారణం వర్మ తీసుకున్న కథాంశం, పెట్టిన టైటిల్. లక్ష్మీపార్వతి అసలు ఎన్టీఆర్ లాంటి మహనీయుడిని ఎలా ప్రభావితం చేసింది. వివాహం చేసుకుని సహచరిగా ఎలా మారింది. తదనంతరం జరిగిన రాజకీయ పరిణామాలు ఇతర అంశాలతో వర్మ సినిమా వుండనుందని స్పష్టం కావటంతో... ఈ సినిమాపై క్యూరియాసిటీ డెవలప్ అయింది.

అయితే వర్మ సినిమాను ఎంతవరకు సహించలేకపోతున్న తెలుగుదేశం పార్టీ నేతలు కొందరు దానిపై దుమ్మెత్తిపోయటం అడపా దడపా జరుగుతున్నదే. ఎందుకంటే వైస్రాయ్ ఘటన నేపథ్యంలో జరిగే సన్నివేశాలు వర్మ సినిమాలో కీలకంగా మారుతాయని తెలియటంతో... చంద్రబాబును విలన్ గా చూపే ప్రయత్నం జరుగుతుందనేది వారి ఆలోచన. అయినా తెలుగు  ప్రజలందరికీ తెలిసిన నిజాన్ని కొత్తగా చూపించటానికి ఏం లేకున్నా... కొత్త తరాలకు ఆ నాటి ఘటనలు కళ్లకు గట్టినట్లు చూపితే వర్మ సక్సెస్ అయినట్లే. ఈ మూవీపై క్రేజ్ భారీగా ఏర్పడటంతో వర్మకు బెదిరింపులు సైతం వచ్చాయి. అవన్నీ ఒకెత్తు.

ఇక వర్మ సినిమా పోస్టర్ కూడా రిలీజ్ చేయటంతో.. ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా.. తమిళనాడు  తెలుగు యువశక్తి నేత కేతిరెడ్డి జగదీశ్వర్ లక్ష్మీస్ వీరగ్రంథం అంటూ వర్మ సినిమాకు వ్యతిరేకంగా సినిమాను ప్రకటించాడు.

ఇప్పుడు ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో... తాను సిన్సియర్ గా సినిమాను తీస్తానంటూనే... వర్మ సినిమా ఆపేస్తే తాను సినిమాను ఆపేయటానికి రెడీగా వున్నానని అంటున్నాడు. అంటే.. ఇది ఖచ్చితంగా వర్మ సినిమాకు కౌంటర్ గా ప్లాన్ చేసిన సినిమాయేనని చెప్పకనే చెబుతున్నాడు కేతిరెడ్డి. అంతేకాక కీలకమైన లక్ష్మీపార్వతి పాత్రలో ఎవరిని ఎంపిక చేశారని అడిగితే... అబ్బే ఇంకా లేదు అంటూ కేతిరెడ్డి ఇచ్చిన సమాధానం బట్టి చూస్తే.. కేతిరెడ్డి సిన్సియారిటీ అర్థం చేసుకోవచ్చు. తన వెనుక టీడీపీ లేదని, తాను సినిమా తీయడం ఖాయం అంటూనే.. ఇంత వరకు సినిమాకు సంబంధించి ఎలాంటి ముందడుగు వేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఇంకా విడ్డూరమేంటంటే... సినిమాకు కీలకమైన ఎన్టీఆర్ పాత్రకూ ఎవర్ని ఎంపిక చేయలేదట. లక్ష్మీపార్వతి మొదటి భర్త వీరగంధం సుబ్బారావు పాత్రకూ ఎవర్నీ ఎంపిక చేయలేదట. అయితే సినిమా షూటింగ్ ప్రారంభమైందని మాత్రం చెప్తున్నాడు. ఆయన ట్రాక్ రికార్డును బట్టి చూసినా కేతిరెడ్డి అప్పుడడెప్పుడో మళయాళంలో వచ్చిన పావన్ క్రూరన్ అనే సినిమాను కామాగ్ని అనే టైటిల్ తో రీమేక్ చేయటం తప్ప మరేమీ పెద్దగా చెప్పుకోవటానికి ఏమీ లేదు.

 

ఇక తాజాగా వర్మ సినిమా ఆపేస్తే నేనూ ఆపేస్తానంటూ తన మనసులోని మాటను చెప్పేసిన కేతిరెడ్డి తన వెనుక ఎవరూ లేరని చెప్పటం మాత్రం జనాలకు అర్థం కానంతటి పెద్ద తార్కికాంశం ఏమీ కాదు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos