ప్రముఖ దర్శక నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి తరచుగా నిరసనలు నిర్వహిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆ మధ్యన బిగ్ బాస్ షో వివాదం నేపథ్యంలో కేతిరెడ్డి ఢిల్లీకి వెళ్లి మరీ నిరసన నిర్వహించారు. తాజాగా మరో ఉద్యమం చేపట్టబోతున్నట్లు ప్రకటించారు. 

1994లో అప్పటి ప్రభుత్వం తెలుగు సినీ కార్మికులకు హైదరాబాద్ లోని చిత్రపురి కాలనిలో భూములు కేటాయించింది. ఆ భూములకు ఓ కమిటీ కూడా ఉంది. కమిటీ సభ్యులు అవినీతికి పాల్పడి భూములని ప్రైవేట్ పరం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. 

ఈ వ్యవహారంపై ఆగష్టు 7న బుధవారం రోజు మధ్యాహ్నం 12 గంటలకు బషీర్ భాగ్ లోని ప్రెస్ క్లబ్ లో నిరసన నిర్వహించబోతున్నట్లు కేతిరెడ్డి ప్రకటించారు. ఈ నిరసన కార్యక్రమానికి ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు, రాజకీయ నాయకులు హాజరు కానున్నారు.