Asianet News TeluguAsianet News Telugu

'పుష్ప-2' లో మెయిన్ ట్విస్ట్ ఆ క్యారక్టర్ దే,అసలు ఊహించం

ఈ సినిమాలో మెయిన్ ఓ ట్విస్ట్ ఉంటుందని తెలుస్తోంది. అది వెన్నుపోటు టైప్ లో వచ్చే ట్విస్ట్. అదే పుష్ప2 కు కీలకం అంటున్నారు. 

Kesava is the main character in Allu Arjun Pushpa the rule
Author
First Published Feb 7, 2023, 12:33 PM IST


టాలీవుడ్‌లో మోస్ట్‌ అవైటడ్‌ మూవీగా విడుదలై బాక్సాఫీస్‌ దగ్గర కలెక్షన్ల మోత మోగించిన చిత్రం  ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నటించిన ‘పుష్ప: ది రైజ్‌’. సుకుమార్‌ డైరక్షన్, బన్నీ యాక్టింగ్‌ ఈ సినిమాకు హైలెట్‌గా నిలవడంతో మొదట్లో డివైడ్ టాక్ తెచ్చుకున్నా తర్వాత  టాక్‌తో సంబంధం లేకుండా కలెక్షన్లలో కొత్త రికార్డు సాధించింది. కరోనా తరువాత ఓ రేంజ్‌లో బాక్సాఫీస్‌ని షేక్‌ చేయడంతో బన్నీ ఫ్యాన్స్‌ ఇప్పటికే పండగ చేసుకున్నారు. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ రెడీ అవుతోంది. ఈ సినిమాలో మెయిన్ ఓ ట్విస్ట్ ఉంటుందని తెలుస్తోంది. అది వెన్నుపోటు టైప్ లో వచ్చే ట్విస్ట్. అదే పుష్ప2 కు కీలకం అంటున్నారు. ఆ ట్విస్ట్ ఎవరి మీద ఉండబోతోంది అంటే..కేశవ పాత్ర మీద. వివరాల్లోకి వెళితే...

పుష్ప 1 సినిమాలో నటన పరంగా చెప్పుకోదగిన విషయం  బన్నీ పక్కన కేశవ పాత్రలో చేసిన జగదీష్ ప్రతాప్ బండారి. కేశవ పాత్రలో, చిత్తూరు యాసలో మాట్లాడుతూ అదరగొట్టాడు.. అతని పేరు జగదీష్ ప్రతాప్ బండారి. ఇప్పుడు పార్ట్ 2 లో కేశవ పాత్ర కీలకమై నిలవనుంది.   ఫహద్ ఫాజిల్ .. చేసిన భన్వర్ సింగ్ షెకావత్ అనే ఐపీఎస్ IPS పాత్రను మించి కేశవ పాత్రకు ప్రాధాన్యత ఉండనుందని తెలుస్తోంది.

 ఇక  జగదీష్ ప్రతాప్ బండారి.....పక్కా తెలంగాణ కుర్రాడు.. పుట్టింది పెరిగిందంతా జయశంకర్ భూపాలపల్లిలో.. వరంగల్‌‌‌‌లో చదువుకున్నా జగదీష్‌‌కి చిన్నప్పటి నుంచి సినిమాలంటే చాలా ఇష్టం ఉండేదట.. ముందుగా ఫిలిమ్ మేకర్ కావాలని అనుకున్నాడట.. ఫిలిమ్ మేకర్ కావడానికి దర్శకుడు ఆర్జీవీ తనకి స్ఫూర్తి అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. 

అప్పటి వరకు చిన్న క్యారెక్టర్లు చేస్తూ వస్తున్న జగదీష్‌ తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంతో సఫలమయ్యాడనే చెప్పాలి.   జగదీష్ ప్రతాప్ బండారి సినిమాలను చూస్తే.. అతను పలాస 1978, మల్లేశం సినిమాలలో నటించాడు. అది కూడా చిన్న పాత్ర మాత్రమే. అయినా అతను చేసిన ప్రాత పరిధిని కాకుండా తన నటన గుర్తించాడు సుకుమార్‌. సీమ యాసలో బాగా మాట్లాడే ఈ నటుడికి అదే యాసలో మాట్లాడే పాత్రను సుకుమార్ ఇవ్వడంతో పాత్ర న్యాయం చేశాడని సినిమా చూసిన వాళ్లు చెప్తున్నారు. మరో విషయం ఏంటంటే పుష్ప సినిమాకు నెరేషన్ ఇచ్చింది కూడా ప్రతాప్ బండారి కావడం గమనార్హం. పుష్ప సక్సెస్ తో ప్రతాప్ బండారి పేరు ప్రస్తుతం తెలుగులో చక్కర్లు కొడుతోంది. పుష్ప 2 రిలీజ్ అయ్యాక  భవిష్యత్తులో మరిన్నీ అవకాశాలు వస్తాయంటున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios