బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మరోసారి బాక్స్ ఆఫీస్ వద్ద సత్త చాటాడు. యాక్షన్ వార్ ఫిల్మ్ గా తెరకెక్కిన కేసరి సినిమా మొదటి రోజే ఊహించని విధంగా కలెక్షన్స్ అందుకుంది. గత కొంత కాలంగా మంచి సందేశాత్మక సినిమాలను చేస్తూ 100 కోట్లకు పైగా మినిమమ్ వసూళ్లను అందుకుంటున్న అక్షయ్ కేసరి సినిమాతో ఈ ఏడాది బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న హీరోగా నిలిచాడు. 

కేసరి ఫస్ట్ డే 21 కోట్ల వసూళ్లను అందుకుంది. గురువారం వరల్డ్ వైడ్ గా రిలీజైన కేసరి ముందు నుంచి పాజిటివ్ టాక్ తో అభిమానుల్లో అంచనాలను పెంచింది. 21 మంచి సిక్కు జవాన్స్ 10 వేల మంది అక్రమదారులను అడ్డుకోని హిందుస్థాన్ కోసం ఎలా పోరాడారు అనేది సినిమా కథ.చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. 

ఫస్ట్ వీక్ లోనే సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులు నమోదు చేయడం ఖాయమని తెలుస్తోంది. అసలైతే ఈ సినిమాలో మొదటగా సల్మాన్ ని హీరోగా అనుకోగా ఎందుకో భాయ్ సినిమా సెట్స్ పైకి వెళ్లకముందే తప్పుకున్నాడు. ఇక ఇప్పుడు అక్షయ్ కథానాయకుడిగా సినిమాకు పూర్తిగా న్యాయం చేశాడని ప్రశంసలు అందుతున్నాయి.