'ఆచార్య' కేరళ లింక్ నిజమేనా..చిరు ఒప్పుకున్నాడా?
ఈ సినిమా మొదలైననాటి నుంచి క్రేజ్ కు తగ్గట్లుగా అప్ డేట్స్ సినిమా హాట్ హాట్ గా మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా ఓ వార్త మీడియాని కుదిపేస్తోంది. అయితే అందులో నిజమెంత అనేది మాత్రం ఎవరికీ తెలియటం లేదు. మరీ ముఖ్యంగా చిరంజీవి అటువంటి డెసిషన్స్ ఒప్పుకోరు. ఇంతకీ ఏమిటా వార్త...
చిరంజీవి.. కొరటాల కాంబోలో రూపొందుతున్న 'ఆచార్య' సినిమాపై ఎక్సపెక్టేషన్స్ ఓ రేంజిలో ఉన్నాయి. కొరటాల గత సినిమాల్లో ఏ ఒక్కటి కూడా ఫ్లాఫ్ కాలేదు. కనుక ఈ సినిమా కూడా ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం అందరిలో ఉంది. దానికి తోడు ఈ సినిమాలో రామ్ చరణ్ కీలక పాత్రలో కనిపించబోతున్న నేపథ్యంలో అంచనాలు రెట్టింపు అయ్యాయి. దాంతో ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్ సినిమా హాట్ హాట్ గా మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా ఓ వార్త మీడియాని కుదిపేస్తోంది. అయితే అందులో నిజమెంత అనేది మాత్రం ఎవరికీ తెలియటం లేదు. మరీ ముఖ్యంగా చిరంజీవి అటువంటి డెసిషన్స్ ఒప్పుకోరు. ఇంతకీ ఏమిటా వార్త...
ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఆచార్య కోసం ఒక భారీ సెట్టింగ్ ను రూ.20 కోట్లతో నిర్మించబోతున్నారు.ఆ సెట్ .. కేరళ కు చెందిన ప్రముఖ ఆలయాలు మరియు వీధులను ప్రతిబింబిస్తూ సాగుతుందిట. ఆ సెట్ ను హైదరాబాద్ లో నిర్మించబోతున్నారు. అందుకే అంత భారీ గా ఖర్చు అవుతుందని చెప్తున్నారు. అయితే కథ ఆంధ్రా,తెలంగాణాలలో జరిగేది అయితే కేరళలో దేవాలయాల గురించి సెట్ వేయటం ఏమిటి అనేది ఓ ప్రశ్న.
అలాగే అసలు చిరంజీవి సాధ్యమైనంతవరకూ ఖర్చు ని తగ్గించే పనిలో పడ్డారని తెలుస్తోంది. దాంతో ఆయన ఎందుకు ఒప్పుకుంటారు. ఇలా దేవాలయాలు రీక్రియేట్ చేయటం ఏమిటి అంటున్నారు. అయితే సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను ఆ సినిమాలో చిత్రీకరించే ఉద్దేశ్యంతోనే అంత ఖర్చు పెట్టి మరీ సెట్టింగ్ వేస్తున్నట్లుగా చెబుతున్నారు. అందులో నిజమెంత ఉందనేది తెలియాల్సి ఉంది.
ఇక ఎంతో ప్రతిష్టాత్మకంగా ‘ఆచార్య’ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్నాయి. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి, ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కొరటాల శివ సినిమాలంటే కమర్షియల్ హంగులతో పాటు సామాజిక సందేశంతో కూడి ఉంటాయి. చిరు ఇందులో మధ్య వయస్కుడైన నక్సలైట్‌గా కనిపిస్తారని, దేవాదాయ ధర్మాదాయ శాఖలో జరిగే అవినీతిపై పోరాడతారని టాక్. అయితే, కొరటాల శివ టేకింగ్, చిరంజీవి నట విశ్వరూపం చూడాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. రామ్‌చరణ్ కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. కాజల్ కథనాయిక. మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు.