Asianet News TeluguAsianet News Telugu

దర్శకుడితో సహా అడ్డంగా బుక్కైన అమలాపాల్

  • కేరళలో పన్ను ఎగవేత కేసులో అమలాపాల్
  • తప్పుడు పత్రాలతో సర్కారు ఆదాయానికి గండి కొట్టారని నిర్దారణ
  • అమలాపాల్ తో సహా దర్శకుడు ఫాజిల్ పైనా చీటింగ్ కేసు పెట్టిన పోలీసులు 
kerala police filed cheating case against amalapaul

హిరోయిన్ అమలాపాల్ పై కేసు నమోదైంది. డైరెక్టర్ పహద్ ఫాజిల్‌పైనా చీటింగ్ కేసు నమోదైంది. ఇద్దరూ కేరళలో పన్ను తప్పించుకోవడానికి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించారనే ఆరోపణలపై పాండిచ్చేరి పోలీసులు కేసు నమోదు చేశారు. అమలాపాల్, ఫాజిల్‌ ఈ కేసులో ఇరుక్కోవడం మళయాల పరిశ్రమలో, కోలీవుడ్ లో చర్చనీయాంశమైంది.

 

వివరాల్లోకెళితే... రూ.20 లక్షలకు పైగా ధర పలికే విలాసవంతమైన కార్లపై 20 శాతం పన్ను తప్పించుకోవడానికి పాండిచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంలో అమలాపాల్, ఫాజిల్ తప్పుడు పత్రాలు సృష్టించారు. కేరళకు చెందిన వీరిద్దరూ కేరళలో కార్లను కొనుగోలు చేసి పాండిచ్చేరిలో రిజిస్టర్ చేశారు. అందుకోసం కొన్ని సర్టిఫికెట్లను ఫోర్జరీ చేశారని పోలీసుల వెల్లడించారు. క్రైం బ్రాంచ్ పోలీసుల దర్యాప్తు కేసు నమోదు అయినందున్న అమలాపాల్‌, ఫాజిల్‌ను త్వరలోనే క్రైం బ్రాంచ్ అధికారులు విచారించనున్నారు. ఇప్పటికే వీరికి నోటీసులు పంపినట్టు సమాచారం. కొద్దిరోజుల్లో అమలపాల్‌, ఫాజిల్ క్రైం బ్రాంచ్ అధికారుల ముందుకు విచారణకు హాజరుకావాల్సి ఉంటుంది అని ఓ పత్రిక కథనాన్ని వెల్లడించింది.

 

అమలపాల్ రూ. 1.75 లక్షలు చెల్లించి ఎస్ క్లాస్ బెంజ్ కారును లోన్‌పై తీసుకొన్నారు. అయితే పాండిచ్చేరిలో ఉమేశ్ పేరిట ఉన్న ఓ ఇంటిలో కిరాయికి ఉంటున్నట్టు చూపే పత్రాలను ఆమె సమర్పించారు. ఇదే అడ్రస్ నుంచి చాలా మంది ప్రముఖులు కార్లను రిజిస్టర్ చేసుకొన్నట్టు దర్యాప్తులో వెల్లడైంది.  ఫాజిల్‌ కూడా కేరళలోని అలప్పు అడ్రస్‌పై కారును లోన్‌పై తీసుకొన్నారు. కానీ రిజిస్టిర్ సమయంలో పాండిచ్చేరి నివాసిగా పత్రాలు సృష్టించారు అనే విషయం పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ విషయాన్ని దర్యాప్తు అధికారుల తీవ్రంగా పరిగణిస్తున్నారు.

 

ఫోర్జరీ పత్రాలతో పన్ను ఎగవేతకు పాల్పడుతూ కార్లను తప్పుడు పద్ధతిలో రిజిస్టర్ చేసుకొనే దందా తాజాగా పోలీసులు ఛేదించారు. ప్రముఖులు, సినీ నటులు చేసే ఈ దందా వల్ల ప్రభుత్వ ఆదాయానికి ఏటా రూ.500 కోట్ల నష్టం జరుగుతున్నట్టు అంచనా.

 

కేంద్ర పాలిత ప్రాంతాల్లో పన్ను చెల్లింపు చాలా తక్కువగా ఉంటుంది. వాహనాల రిజిస్ట్రేషన్‌పై పన్ను తప్పించుకోవడానికి ప్రముఖులు ఇలాంటి తప్పుడు పనులకు పాల్పడుతున్నట్టు వార్తలు వచ్చాయి. ఇప్పటి వరకు 1500 వెహికిల్స్‌ పై పన్ను చెల్లించకుండా తప్పించుకొన్నట్టు సమాచారం. దాదాపు 45 మంది ప్రముఖులపై కేసులు నమోదు చేసినట్టు తెలుస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios