మళయాల సూపర్ స్టార్ దిలీప్ అరెస్ట్ దిలీప్ తో పాటు దర్శకుడు నాదిర్ షాను అరెస్ట్ చేసిన పోలీసులు నటి భావన కిడ్నాప్, లైంగిక దాడి కేసులో ప్రమేయమున్నట్లు నిర్దారణ
మలయాళ నటిపై లైంగికదాడియత్నం, కిడ్నాప్ కేసులో మలయాళ సూపర్ స్టార్ దిలీప్, ప్రముఖ దర్శకుడు నాదిర్ షాను కేరళ పోలీసుల అరెస్ట్ చేయడం సంచలనం రేపింది. దిలీప్‌ను సోమవారం సాయంత్రం పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో మలయాళ చిత్ర పరిశ్రమ ఉలిక్కిపడింది. నటిపై అత్యాచారయత్నం, కిడ్నాప్ కేసులో నిందితుడిగా ఉన్న ఆయనను సోమవారం సాయంత్రం కేరళ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 17వ తేదీ రాత్రి తన వాహనంలో వెళ్తున్న బాధిత నటిని కొందరు అడ్డగించి ఆమె కారులోనే రెండు గంటలపాటు లైంగికంగా వేధించారు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో పలు చిత్రాల్లో నటించిన హీరోయిన్‌ను కొందరు కిడ్నాప్ చేసి లైంగికంగా వేధించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే.
ఫిబ్రవరి 17న నటి కారు డ్రైవర్ మార్టిన్ ఇచ్చిన సమాచారంతో ప్రధాన నిందితుడు పల్సర్ సుని రంగంలోకి దిగాడు. పల్సర్ సుని అక్కడి నుంచి వాహనాన్ని కక్కనాడ్‌కు తీసుకెళ్లి.. అక్కడ నటిని లైంగికంగా వేధించాడు. అశ్లీలంగా, అసభ్యంగా వీడియోలు, ఫొటోలు తీశాడు. సహకరించకపోతే చంపుతామని బెదిరించారు. దాదాపు రెండున్నర గంటలపాటు ఈ అమానుషం కొనసాగింది. అనంతరం ఆమెను కక్కనాడ్ సమీపంలోని పాదముద్గల్ వద్ద కారులోంచి బయటకు పొదల్లోకి తోసివేశారు.
నటిపై లైంగికదాడి, కిడ్నాప్ కేసు ముగుస్తుందని భావిస్తుండగా, ఈ కేసుకు సంబంధించిన ఆడియో టేపులు బయటపడటంతో మరోసారి ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు పల్సర్ సునీ, డ్రైవర్ మార్టిన్ గతంలోనే అదుపులోకి తీసుకొన్నారు. ఈ ఘటన వెనుక సినీ ప్రముఖుల హస్తం ఉందనే ఆరోపణలు తలెత్తాయి.
ఫిబ్రవరిలో జరిగిన కిడ్నాప్ వ్యవహారానికి సంబంధించిన ఆడియో టేప్ ఒకటి తాజాగా బయటపడటంతో ఈ కేసును కేరళ పోలీసులు తిరగదోడిన సంగతి తెలిసిందే. తాజా టేపుల్లో ప్రముఖ దర్శకుడు నాదిర్ షాను మధ్యవర్తిత్వం జరుపాలని ఓ వ్యక్తి ఫోన్ చేశాడనే విషయం స్పష్టమైంది. దీంతో మలయాళ సూపర్ స్టార్ దిలీప్, దర్శకుడు నాదిర్ షా, పల్సర్ సునీలను కొద్ది రోజుల క్రితం విచారించారు. తాజా ఆడియో టేపులు బయటపడిన తర్వాత మరోసారి కేసు విచారణ వేగం పుంజుకొన్నది. నటుడు దిలీప్, దర్శకుడు నాదిర్ షాను దాదాపు 13 గంటలపాటు విచారించారు.
వ్యక్తిగత కక్షతోనే నటిని కిడ్నాప్ చేయించి, వేధించేందుకు ఆయన కుట్ర పన్నారనే ఆరోపణలకు ఆధారాలు లభించాయి. విచారణలో అనేక విషయాలను పరిశీలించిన పిదప సూపర్ స్టార్ దిలీప్‌ను సోమవారం అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో దిలీప్‌ను అరెస్టు చేయడం ఈ కేసులో కీలక పరిణామంగా మారింది. కీలకంగా మారిన దిలీప్ అరెస్ట్ ఈ కేసులో ప్రధాన నిందితుడు అయిన పల్సర్ సుని అనే వ్యక్తిని, నటి వాహనం డ్రైవర్ మార్టిన్‌తోపాటు మొత్తం ఆరుగురిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు వెనుక పలువురు సినీ పెద్దల హస్తముందని గతంలోనే కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మలయాళ ప్రముఖ హీరోల్లో ఒకరిగా ఉన్న దిలీప్‌ను రెండువారాల కిందట పోలీసులు 12 గంటలపాటు విచారించారు. వ్యక్తిగత కక్షతోనే నటిని కిడ్నాప్ చేయించి.. వేధించేందుకు ఆయన కుట్ర పన్నినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో దిలీప్, నాదిర్ షాను అరెస్టు చేయడం ఈ కేసులో కీలక పరిణామంగా మారింది.