‘‘వరాహ రూపం’’ పాట విషయంపై మాతృభూమి ప్రింటింగ్ అండ్ పబ్లిషింగ్ కంపెనీ కొద్ది రోజుల క్రితం కొజికోడ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 


రీసెంట్ గా కన్నడలో తెరకెక్కి సూపర్ హిట్ కొట్టిన కాంతారా మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఈ సినిమా కేవలం కన్నడంలో మాత్రమే కాకుండా తెలుగు సహా పలు ఇతర భాష్లల్లో కూడా రిలీజ్ అయి అన్ని చోట్ల పెద్ద సెన్సేషన్ సృష్టించింది. ఇప్పటికే రూ.400 కోట్ల కలెక్షన్ దక్కించుకున్న కాంతారా పై అనేకమంది ప్రేక్కాభిమానుల తోపాటు పలువురు సినీ విశ్లేషకులు, విమర్శకులు సైతం ప్రసంశలు కురిపించారు. అయితే ఈ చిత్రంలోని వరాహ రూపం పాట వివాదాస్పదం అయ్యి కోర్టు కు ఎక్కిన సంగతి తెలిసిందే. 

ఈ పాట ట్యూన్ మలయాళ ఆల్బమ్ సాంగ్ నుంచి కాపీ కొట్టారంటూ వివాదం మొదలైంది. కాంతారాలోని వరాహ రూపం పాట తమ పాటకు కాపీకి అని కేరళకు చెందిన ప్రముఖ మ్యూజిక్‌ బ్యాండ్‌ తైక్కుడం బ్రిడ్జి ఆరోపిస్తూ కోర్టుకు ఎక్కింది. అక్కడితో ఆగకుండా ఈ సినిమాని మలయాళంలో విడుదల చేసిన పృథ్వీరాజ్ సుకుమారన్ పై కూడా తైక్కుడం మ్యూజిక్ బ్యాండ్ వారు పోలీసులకు ఫిర్యాదు చేసారు. దాంతో ఆయనపై కూడా కేసు నమోదైంది.

‘‘వరాహ రూపం’’ పాట విషయంపై మాతృభూమి ప్రింటింగ్ అండ్ పబ్లిషింగ్ కంపెనీ కొద్ది రోజుల క్రితం కొజికోడ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు పృథ్వీరాజ్ ప్రొడక్షన్ లిమిటెడ్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేరళలో ‘కాంతార’ సినిమాకు పృథ్వీరాజ్ ప్రొడక్షన్ లిమిటెడ్ డిస్ట్రిబ్యూటర్గా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆ కంపెనీకి డైరెక్టర్ గా కొనసాగుతున్న పృథ్వీరాజ్ పైనా కేసు నమోదు అయ్యింది. వెంటనే ఆయన హైకోర్టును ఆశ్రయించడంతో తాజాగా కోర్టు స్టే విధించింది.

అయితే పృథ్వీరాజ్ సుకుమారన్ తరుపున ఆయన లాయర్ కేరళ కోర్టుకు ఈ కేసు విషయమై కొన్ని విషయాలు వెల్లడించారు. 'కాంతార' వివాదానికి పృథ్వీరాజ్ సుకుమారన్ కు ఎలాంటి సంబంధం లేదని ఈ సినిమాని ఆయన కేవలం మలయాళంలో రిలీజ్ మాత్రమే చేశారని స్పష్టం చేశాడు. దీంతో ఈ విషయాన్ని పరిగణలోని తీసుకున్న కోర్టు పృథ్వీరాజ్ సుకుమారన్ ను ఈ కేసు నుంచి తప్పిస్తూ స్టే విధించింది. ఈ కేసులోకి అనవసరంగా నటుడు పృథ్వీరాజ్ ను లాగుతున్నారని జస్టిస్ కురియన్ థామస్ ధర్మాసనం అభిప్రాయపడింది. ఆయన కేవలం డిస్ట్రిబ్యూటర్ మాత్రమే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని తేల్చి చెప్పింది. ఈ కేసుపై ఫిబ్రవరి 22 వరకు స్టే విధిస్తున్నట్లు ఆదేశాలిచ్చింది.

రిషబ్ శెట్టి స్వయంగా నటిస్తూ తెరకెక్కించిన ఈ డివైన్ బ్లాక్ బస్టర్ మూవీలో సప్తమి గౌడ హీరోయిన్ గా నటించగా హోంబలె ఫిలిమ్స్ వారు దీనిని ఎంతో గ్రాండ్ గా నిర్మించారు.