సావిత్రి బయోపిక్ ‘మహానటి’లో నటించటమే కీర్తి సురేష్ కు కలిసి వచ్చింది.  ఆ ఒక్క  సినిమాతోనే ఆమె  స్టార్ హీరోల స్థాయి క్రేజ్‌ను సంపాదించుకుంది అని చెప్పటం అతిశయోక్తికాదు. ఈ సినిమా తర్వాత అమె తెలుగులో ఏ హీరో సరసన సినిమా కమిటవ్వుతుందా అని అభిమానులంతా ఎదురుచూసారు. కానీ ఆమె తన పాత్రకు ప్రాధాన్యత ఉంటూ, అభినయానికి ఆస్కార ముండే సినిమాలే కమిటవ్వాలని ప్లాన్ చేసుకుంది. 

దాంతో సహజంగా పెద్ద హీరోల సినిమాల్లో అలాంటి పాత్రలు దొరకవు కాబట్టి...అటు తమిళంకు వెళ్లి బిజీ అయ్యింది. అయితే తెలుగులో మాత్రం ఇప్పుడు ఆమె దృష్టి ఓ పెద్ద ప్రాజెక్టు మీద ఉందని సమాచారం. అది మరేదో కాదు...ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో రాజమౌళి రూపొందిస్తున్న ‘ఆర్ ఆర్ ఆర్’. ఈ ప్రాజెక్టు నిమిత్తమై ఆమెను సంప్రదించారని మీడియా వర్గాల సమాచారం. 

అయితే ఎవరి సరసన..ఆమెను తీసుకుంటారు అనేది తెలియలేదు. కాకపోతే.. బల్క్ గా డేట్స్ కావాలనటంతో కీర్తి సురేష్ కు ఉన్న ఇతర ఎసైన్మెంట్స్ కు సమస్య వస్తుందని భావించి.. ఎడ్జస్ట్ చేయగలిగితే ఈ సినిమా చేయాలనే ఉద్దేశ్యంతో వేరే సినిమాలు ఏమీ ఓకే చేయటం లేదంటున్నారు. 

ఇదే నిజమైతే కీర్తి సురేష్ కు కలిసొచ్చే కాలం వచ్చేసినట్లే. ఎందుకంటే అంత ప్రాజెక్టులో చేస్తే ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది కాబట్టి అంతటా నానే అవకాసం ఉంది. అలాగే రాజమౌళి ఎలా హీరోయిన్స్ ని ప్రొజెక్టు చేస్తారో.. ఎంత డెప్త్ గా క్యారక్టర్స్ ని డిజైన్ చేస్తారో మనకు తెలుసు..కాబట్టి మరో  ‘మహానటి’లాంటి ప్రాజెక్టు అవుతుందనటంలో సందేహం లేదు. ఏమంటారు.

ఈ చిత్రానికి కథ: విజయేంద్రప్రసాద్, మాటలు: సాయిమాధవ్‌ బుర్రా, కార్కీ, కాస్ట్యూమ్‌ డిజైనర్‌: రమా రాజమౌళి, కూర్పు: శ్రీకర్‌ ప్రసాద్, వి.ఎఫ్‌.ఎక్స్‌ సూపర్‌వైజర్‌: శ్రీనివాస్‌ మోహన్, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, ప్రొడక్షన్‌ డిజైనర్‌: సాబు సిరిల్, ఛాయాగ్రహణం: కె.కె.సెంథిల్‌కుమార్, సమర్పణ: డి.పార్వతి.