Asianet News TeluguAsianet News Telugu

దిల్ రాజు అండ..మూడో సారైనా కీర్తి సక్సెస్ అవుతుందా?

'మహానటి' తో తానేంటో ప్రూవ్ చేసుకున్న నటి కీర్తి సురేష్. అలనాటి సావిత్రి పాత్రలో ఒదిగిపోయిన కీర్తి సురేష్ ఒక్కసారిగా సౌతిండియాలో హాట్ ప్రాపర్టీగా మారిపోయారు. ఈ నేపధ్యంలో ఆమెతో వరస ప్రాజెక్టులు ఎనౌన్స్ అయ్యాయి. అంతేకాదు కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నడిచే లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు సైతం తెర లేచింది. ఇఫ్పటికే పెంగ్విన్, మిస్ ఇండియా సినిమాలు ఓటీటిలో రిలీజ్ అయ్యాయి. కరోనా లాక్ డౌన్ తో ఆమె సినిమాలు ఓటీటి మార్గం ఆశ్రయించాయి. అయితే ఆ రెండు సినిమాలు వర్కవుట్ కాలేదు. ఫ్లాఫ్ అయ్యాయి. ఇప్పుడు ముచ్చటగా మూడో సారి మరో లేడీ ఓరియెంటెడ్ చిత్రంతో మన ముందుకు వస్తోంది. ఆ సినిమా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసారు. 

Keerthy Suresh Succeed in Third Attempt? jsp
Author
Hyderabad, First Published Mar 2, 2021, 8:55 AM IST

'మహానటి' తో తానేంటో ప్రూవ్ చేసుకున్న నటి కీర్తి సురేష్. అలనాటి సావిత్రి పాత్రలో ఒదిగిపోయిన కీర్తి సురేష్ ఒక్కసారిగా సౌతిండియాలో హాట్ ప్రాపర్టీగా మారిపోయారు. ఈ నేపధ్యంలో ఆమెతో వరస ప్రాజెక్టులు ఎనౌన్స్ అయ్యాయి. అంతేకాదు కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నడిచే లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు సైతం తెర లేచింది. ఇఫ్పటికే పెంగ్విన్, మిస్ ఇండియా సినిమాలు ఓటీటిలో రిలీజ్ అయ్యాయి. కరోనా లాక్ డౌన్ తో ఆమె సినిమాలు ఓటీటి మార్గం ఆశ్రయించాయి. అయితే ఆ రెండు సినిమాలు వర్కవుట్ కాలేదు. ఫ్లాఫ్ అయ్యాయి. ఇప్పుడు ముచ్చటగా మూడో సారి మరో లేడీ ఓరియెంటెడ్ చిత్రంతో మన ముందుకు వస్తోంది. ఆ సినిమా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసారు. 

వివరాల్లోకి వెళితే...జాతీయ ఉత్త‌మ‌న‌టి కీర్తి సురేష్ టైటిల్ రోల్ పోషిస్తోన్న చిత్రం ‘గుడ్ ల‌క్ స‌ఖి’. ఆది పినిశెట్టి హీరోగా న‌టిస్తుండ‌గా, జ‌గ‌ప‌తిబాబు ఓ కీల‌క పాత్ర చేస్తున్నారు. విమ‌న్ సెంట్రిక్ ఫిల్మ్‌గా రూపొందుతోన్న ఈ మూవీకి స‌హ నిర్మాత శ్రావ్య వ‌ర్మ ఆధ్వ‌ర్యంలో ఎక్కువ మంది లేడీ టెక్నీషియ‌న్లు ప‌నిచేస్తుండ‌టం గ‌మ‌నార్హం. న‌గేష్ కుకునూర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ఏక కాలంలో నిర్మాణ‌మ‌వుతోంది.

పాపుల‌ర్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు స‌మ‌ర్పిస్తోన్న ‘గుడ్ ల‌క్ స‌ఖి’ని వ‌ర్త ఎ షాట్ మోష‌న్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై సుధీర్ చంద్ర పాదిరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని జూన్ 3న విడుద‌ల చేస్తున్న‌ట్లు ఒక రిలీజ్ డేట్ పోస్ట‌ర్ ద్వారా చిత్ర టీమ్ ప్ర‌క‌టించింది. ఆ పోస్ట‌ర్‌లో కీర్తి సురేష్ ఓ గ‌న్ ప‌ట్టుకొని చిరునవ్వులు చిందిస్తుండ‌గా, ఆమెకు చెరోవైపు జ‌గ‌ప‌తిబాబు, ఆది పినిశెట్టి నిల్చొని ఉన్నారు.

స్పోర్ట్స్ రొమ్‌-కామ్‌గా రూపొందుతోన్న ఈ మూవీలో కీర్తి సురేష్ ఒక షూట‌ర్‌గా క‌నిపించ‌నున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీ‌ప్ర‌సాద్ మ్యూజిక్ స‌మ‌కూరుస్తుండ‌గా, చిరంత‌న్ దాస్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. ఇదివ‌ర‌కు విడుద‌ల చేసిన టీజ‌ర్‌, ఇత‌ర ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్‌కు అన్ని వ‌ర్గాల నుంచీ ట్రెమండ‌స్ రెస్పాన్స్ ల‌భించింది.

తారాగ‌ణం:
కీర్తి సురేష్‌, ఆది పినిశెట్టి, జ‌గ‌ప‌తిబాబు, రాహుల్ రామ‌కృష్ణ‌, ర‌మాప్ర‌భ త‌దిత‌రులు.

సాంకేతిక బృందం:
డైరెక్ట‌ర్‌: న‌గేష్ కుకునూర్‌
స‌మ‌ర్ప‌ణ‌: దిల్ రాజు (శ్రీ వేంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌)
ప్రొడ్యూస‌ర్‌: సుధీర్ చంద్ర పాదిరి
బ్యాన‌ర్‌: వ‌ర్త్ ఎ షాట్ మోష‌న్ ఆర్ట్స్‌
స‌హ నిర్మాత‌: శ్రావ్య వ‌ర్మ‌
మ్యూజిక్‌: దేవి శ్రీ‌ప్ర‌సాద్‌
సినిమాటోగ్ర‌ఫీ: చిరంత‌న్ దాస్

Follow Us:
Download App:
  • android
  • ios