వాలెంటైన్స్ డే సందర్భంగా ‘సర్కారు వారి పాట’ మూవీ నుంచి రిలీజైన   ‘కళావతి’(Kalavaavathi) సాంగ్ ఇంటర్నెట్ లో సంచలనం  సృష్టిస్తోంది. మరోవైపు మహేశ్ బాబు డ్యాన్స్ కూడా ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ సాంగ్ కు మహేశ్ వేసిన స్టెప్పులనే కీర్తి సురేశ్ రిపీట్ చేసింది.    

సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu), డైరెక్టర్ పరశురామ్ పెట్ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ ‘సర్కారు వారి పాట’. ఈ చిత్రంలో మహేశ్ బాబు సరసన కీర్తి సురేష్ (Keerthy Suresh) ఆడిపాడనుంది. ఈ మూవీ చిత్రీకరణ పనులు శరవేగంగా కొనసాగుతుండగా.. వాలెంటైన్స్ డే సందర్భంగా మేకర్స్ ఫస్ట్ సింగిల్ ‘కళావతి’ని వదిలారు. ప్రస్తుతం ఈ సాంగ్ ట్రైండ్ అవుతోంది. కాగా ఈ సాంగ్ కు తాజాగా హీరోయిన్ కీర్తి సురేష్ స్టెప్పులేసింది. మహేష్ బాబు ‘కళావతి’ సాంగ్ కు వేసిన డ్యాన్స్ మూమెంట్స్‌నే రిపీట్ చేస్తూ డ్యాన్స్ చేసింది. ఈ వీడియోను తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది. డ్యాన్స్ చేస్తూనే చిరునవ్వుతోనూ తన ఫాలోవర్లను మంత్రముగ్దులను చేసింది. ప్రస్తుతం ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు, అభిమానులు కీర్తిని ప్రశంసిస్తూ కామెంట్లు పెడుతున్నారు.. లైక్ లతో ఎంకరేజ్ చేస్తున్నారు. 

అయితే, ఈ వీడియోను అప్ లోడ్ చేస్తూ ఒక నోట్ ను కూడా రాసింది. ‘కళావతి’నే సయంగా ‘కళావతి ఛాలెంజ్’ లోకి దిగింది’ అంటూ పేర్కొంది. తనకు తానే ఛాలెంజ్ చేసుకుని ఈ సాంగ్ కు మహేశ్ బాబును అనుకరించింది. మరోవైపు సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ‘థమన్’ (Thaman) క్యాచీ ట్యూన్ అందించడం, స్టార్ సింగర్ సిద్ద్ శ్రీరామ్ (Sid Sriram) మెలోడీ వాయిస్, అనంత శ్రీరామ్ మంచి లిరిక్స్ అందించడంతో సాంగ్ ఇంటర్నెట్ లో దూసుకుపోతోంది. విడుదల ఒక్క రోజులోనే 20 మిలియన్ల కు పైగా వ్యూస్ ను దక్కించుకుంది. నిన్నటికే 35 మిలియన్ల వ్యూస్ కు చేరుకుని.. ప్రస్తుతం 40 మిలియన్ వ్యూస్ రీచ్ అయ్యే దిశగా పయనిస్తోంది. సాంగ్ రిలీజ్ అయ్యి వారం దాటినా ఇంకా ట్రెండ్ అవుతూనే ఉంది.

View post on Instagram

మరోవైపు కళావతి పాట ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టిస్తూ సంగీత ప్రియుల హృదయాలను కొల్లగొడుతున్న సంగతి తెలిసిందే. ఈ పాట కోసం పలువురు సెలబ్రిటీలు తమ డ్యాన్స్ మూమెంట్స్‌ను పంచుకున్నారు. నిన్న మహేశ్ బాబు డాటర్ ‘సితార’ కూడా అచ్చు తండ్రిలాగే డ్యాన్స్ చేసింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం వైరల్ అవుతోంది. మరోవైపు డైరెక్టర్ హరీశ్ శంకర్ (Harish Shankar) కూడా ఈ సాంగ్ లోని లిరిక్స్ ను ట్విట్టర్ లో షేర్ చేశాడు. ‘అద్భుతమైన లిరిక్స్, క్లాస్ కంపోసిషన్’ అంటూ పేర్కొన్నాడు. 

‘మహానటి’(Mahanati) మూవీతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. తెలుగులో ఇటీవల గుడ్ లక్ సఖి మూవీతో ప్రేక్షకులను అలరించిన కీర్తి... సర్కారు వారి పాటతోనూ మరింత అలరించనుంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి అప్ కమింగ్ ఫిల్మ్ ‘బోళా శంకర్’లోనూ కీర్తి సురేష్ నటిస్తోంది. తాజాగా మలయాళంలోనూ ‘వాషి’అనే మూవీలో న్యాయవాది పాత్రను పోషిస్తోంది. ఇక ‘గంధారి’ అనే మ్యూజిక్ వీడియోలో కూడా నటిస్తోందీ