సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట చిత్రం మే 12న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. గీత గోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట చిత్రం మే 12న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. గీత గోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రిలీజ్ టైం దగ్గర పడడంతో నేడు హైదరాబాద్ లోని యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. 

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కళావతి కీర్తి సురేష్ మాట్లాడుతూ సుతిమెత్తగా జోకులు పేల్చింది. గతంలోని తాను మైత్రి మూవీస్ సంస్థతో వర్క్ చేయాల్సింది అని.. కానీ అది ఇప్పటికి కుదిరింది అని కీర్తి సురేష్ పేర్కొంది. ఇక సెట్స్ లో దర్శకుడు పరశురామ్ ఒక్కోసారి మరచిపోయి తనని రష్మిక అని పిలిచేవాడని చెప్పింది. 

పరశురామ్ తెరకెక్కించే తదుపరి చిత్రాల్లో రష్మిక నటిస్తే.. ఇలాగే మరచిపోయి కీర్తి సురేష్ అని పిలిస్తే చూడాలని ఉంది. ఇక మ..మ .. మహేష్ గారి గురించి మాట్లాడాలి. ఆయనతో పోటీ పది నటిస్తానో లేదో అనే టెన్షన్.. ఆయన అందంతో సరిపోతానో లేదో అనే టెన్షన్ ఉండేవని పేర్కొంది. 

ఇక అభిమానులు మహేష్.. మహేష్ అంటూ గోల చేస్తుంటే.. ఆయన ఉన్నారు.. ఆయన విన్నారు అంటూ జోకులు వేసింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కీర్తి సురేష్ గ్లామర్ గ్లామర్ గా ముస్తాబై వచ్చి అందరిని ఆకర్షించింది.