విజయ్ పుట్టిన రోజు సందర్భంగా అనేక తారలు విషెస్ తెలిపారు. మహానటి కీర్తిసురేష్ కూడా బర్త్ డే విషెస్ తెలిపింది. కానీ విజయ్‌పై తనకున్న ప్రత్యేకమైన అభిమానాన్ని చాటుకుంది.
దళపతి విజయ్‌పై మరోసారి తన అభిమానాన్ని చాటుకుంది `మహానటి` కీర్తసురేష్. మంగళవారం విజయ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా అనేక తారలు విషెస్ తెలిపారు. మహానటి కీర్తిసురేష్ కూడా బర్త్ డే విషెస్ తెలిపింది. కానీ విజయ్‌పై తనకున్న ప్రత్యేకమైన అభిమానాన్ని చాటుకుంది. విజయ్ నటించిన `మాస్టర్` చిత్రంలోని ఇంట్రడక్షన్ మాస్ బీట్ సాంగ్‌కి స్టెప్పులేసింది. డాన్సర్‌తో కలిసి కీర్తిసురేష్ మాస్ డాన్స్ చేసింది. మామూలుగా కాదు, అదిరిపోయేలా చేసింది. విజయ్‌కి బర్త్ డే గిఫ్ట్ గా ఇచ్చింది.
తాను విజయ్‌కి గొప్ప అభిమానని తెలిపింది కీర్తిసురేష్. ప్రస్తుతం కీర్తిసురేష్ చేసిన డాన్స్ వీడియోని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకోగా అది వైరల్ అవుతుంది. అయితే విజయ్‌పై కీర్తికి ఇలా రేంజ్‌లో అభిమానం ఉండటం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇప్పుడే కాదు, గతేడాది కూడా కీర్తిసురేష్ ఇలాంటి విజయ్‌కి మంచి గిఫ్ట్ ఇచ్చింది. అప్పుడు గిటార్ వాయిస్తూ బర్త్ డే విషెష్ చెప్పింది. జీవితం చాలా చిన్నదని, ప్రతి క్షణం ఎంజాయ్ చేయాలని, ఆనందంగా గడపాలని చెబుతూ, విజయ్ సర్ మీకు చిన్న ట్రిబ్యూట్` అంటూ ఈ వీడియోని షేర్ చేసింది.
కీర్తిసురేష్.. విజయ్‌తో కలిసి రెండు సినిమాల్లో నటించింది. 2017లో `భైరవ` చిత్రంలో మొదటి నటించి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత `సర్కార్` చిత్రంలోనూ నటించింది. ఈ లెక్కన మరోసారి ఈ అమ్మడికి విజయ్ ఆఫర్ ఇచ్చినా ఇస్తాడేమో చూడాలి. ప్రస్తుతం కీర్తిసురేష్ తెలుగులో `సర్కారు వారి పాట`, `గుడ్‌లక్ సఖీ`, తమిళంలో `అన్నాత్తే`, `సాని కయిధమ్`, మలయాళంలో `వాసి`, `మరక్కర్` చిత్రాల్లో నటిస్తుంది.
