'మహానటి' సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకొని క్రేజ్ పెంచుకున్న నటి కీర్తి సురేష్. ఈ సినిమాకి నేషనల్ అవార్డు సైతం అందుకుంది. తన నటనతో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసిన ఈ బ్యూటీకి తెలుగు, తమిళ భాషల్లో అవకాశాలు పెరిగాయి. ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ కథల్లో నటించే ఛాన్స్ లు వచ్చాయి.

ప్రస్తుతం ఈ బ్యూటీ 'మిస్ ఇండియా' అనే విమెన్ సెంట్రిక్ సినిమాలో నటిస్తోంది. ఇటీవల ఈ సినిమాకి సంబంధించి చిన్న టీజర్ వదిలారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది ఇలా ఉండగా.. నటుడు రానా దగ్గుబాటి ఓ కొరియన్ సినిమా రీమేక్ రైట్స్ ని దక్కించుకున్నాడు. 

ఈ రీమేక్ లో కీర్తి సురేష్ ని ప్రధాన పాత్రలో తీసుకోవాలని భావించాడు. డ్రగ్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ సినిమాలో కీర్తి సురేష్ పోలీస్ ఆఫీసర్ గా నటించాల్సివుంది. ఈ ప్రాజెక్ట్ ఆమె వద్దకు తీసుకువెళ్లగా.. దానికి కీర్తి నో చెప్పింది. తనకు ఆసక్తి లేదని నేరుగా చెప్పలేక కాల్షీట్స్ లేవని చెప్పి తప్పించుకుందట.

కీర్తితోనే సినిమా చేయాలనుకున్న రానాకి షాక్ ఇచ్చింది. ప్రస్తుతం కీర్తికి బదులు మరో నటి కోసం వెతుకులాట మొదలుపెట్టారు. నందిని రెడ్డి ఈ సినిమాను డైరెక్ట్ చేయనుంది. వచ్చే ఏడాదిలో ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది.