మహానటి సినిమాతో ఒక్కసారిగా అటు తమిళ్ ఆడియెన్స్ ని ఇటు తెలుగు జనాలను ఆకర్షించిన బ్యూటీ కీర్తి సురేష్. సర్కార్ సినిమాతో మరో కమర్షియల్ సక్సెస్ అందుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు బాలీవుడ్ పై కూడా కన్నేసింది. 

అజయ్ దేవగన్ తో త్వరలోనే ఓ చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది. అయితే మొన్నటి వరకు కాస్త బొద్దుగా కనిపించిన అమ్మడు ఇప్పుడు స్లిమ్ లుక్ తో షాకిచ్చింది. అద్దంలో సెల్ఫీ దిగిన కీర్తిని చూసి సౌత్ జనాలు షాకవుతున్నారు. కీర్తి ఇంతలా బక్క చిక్కిపోయిందా అని కామెంట్ చేస్తున్నారు. 

గ్లామర్ గర్ల్ గా కొద్దీ కొద్దిగా అడుగులు వేస్తున్నప్పటికీ బేబీ ఎప్పుడు లిమిట్ దాటలేదు. ఇప్పుడు బాలీవుడ్ కోసం జిమ్ లో కష్టపడి సైజ్ జీరోకి వచ్చేసింది. మరి బాలీవుడ్ తెరపై ఎంతవరకు క్లిక్కవుతుందో చూడాలి.