ఇది అక్కినేని ఫ్యాన్స్ కు కాస్త నిరాశ కలిగించే వార్తే. నాగార్జున ప్రస్తుతం మన్మథుడు2 చిత్రంలో నటిస్తున్నాడు ఇది మన్మథుడు చిత్రానికి సీక్వెల్. ఇక నాగార్జున మరో సీక్వెల్ చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో బంగార్రాజు చిత్రంలో నాగార్జున నటించబోతున్నాడు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. 

నాగార్జున కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచినా సోగ్గాడే చిన్ని నాయనా చిత్రానికి ఇది సీక్వెల్. ఈ చిత్రంలో నాగ చైతన్య కూడా నటించబోతున్న సంగతి తెలిసిందే. నాగార్జున సరసన పూజా హెగ్డేని ఒప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక నాగచైతన్య సరసన కీర్తి సురేష్ ఎప్పుడో ఖరారైపోయింది. 

కానీ తాజాగా కీర్తి సురేష్ ఈ చిత్రం నుంచి తప్పుకున్నట్లు టాక్. గతంలో కీర్తి సురేష్ కు కళ్యాణ్ కృష్ణ స్టోరీ లైన్ మాత్రమే వినిపించాడట. క్రేజీ సీక్వెల్ కావడంతో ఆ సమయంలో కీర్తి సురేష్ ఓకే చెప్పేసింది. కానీ ఇటీవల కళ్యాణ్ కృష్ణ.. కీర్తి సురేష్ కు ఫైనల్ నేరేషన్ వినిపించాడట. తన పాత్రని తీర్చిదిద్దిన విధానానికి కీర్తి అప్సెట్ అయినట్లు సమాచారం. 

కథలో తన పాత్రకు తగినంత ప్రాధాన్యం లేకపోవడంతో బంగార్రాజు చిత్రానికి కీర్తి నో చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో కళ్యాణ్ కృష్ణ మరో హీరోయిన్ కోసం చూస్తున్నాడట.