నటనకు అవకాసం ఉన్న పాత్రలకు కేరాఫ్ ఎడ్రస్ గా నిలిచింది కీర్తి సురేష్‌. అటు ట్రెడిషనల్ క్యారక్టర్సే కాకుండా ,   మోడరన్‌  అమ్మాయిగానూ అదరకొడుతుంది.దానికి తోడు మహానటిలో ఆమె నటన చూసిన చాలా మంది ఆమెకు ఫ్యాన్స్ అయ్యిపోయారు. ముఖ్యంగా ఆమె కు మిగతా హీరోయిన్స్ కన్నా ఎక్కువ మంది మహిళా అభిమానులు ఉన్నారు.  ఈ నేపధ్యంలో ఓ డిఫరెంట్ పాత్ర ఉందంటే ఖచ్చితంగా కీర్తి సురేష్ చేస్తేనే పండుతుందని దర్శక,నిర్మాతలు భావిస్తున్నారు.

ఇప్పుడు ఆమె దగ్గరకు అలాంటి పాత్రే ఒకటి చేరింది. అదే ఆమె కొత్తగా కమిటైన సఖి చిత్రంలో పాత్ర. సఖి అనగానే మనకు మణిరత్నం సూపర్ హిట్ చిత్రం గుర్తుకు వస్తుంది. మాధవన్ హీరోగా చేసిన ఆ చిత్రంలో షాలిని ఆయనకు జోడీగా చేసింది. వారిద్దరి పెయిర్ 2000 సంవత్సరంలో పెద్ద సంచలనం. ఆ జ్ఞాపకాలు ఇంకా తెలుగు సిని ప్రేమికుల మెమెరీనుంచి పోలేదు.

ఇప్పుడు అదే టైటిల్ తో కీర్తి సురేష్ సినిమా చేస్తూండటంతో ఆమెకు భాధ్యత పెరిగినట్లైంది. నాగేంద్ర అనే నూతన దర్శకుడు డైరక్ట్ చేస్తున్న ఈ చిత్రం హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా. అసలు టైటిల్ వినే వెంటనే కీర్తి సురేష్ కనెక్ట్ అయ్యి కథ వినటానికి రెడీ అయ్యిందిట. తమ కథ కు ఆ టైటిల్ ఫెరఫెక్ట్ యాప్ట్ అంటోంది టీమ్.

కొత్త దర్శకుడు అయినా నాగేంద్ర ఓ చక్కని కథతో వచ్చాడని తెలుస్తోంది. మహానటి తర్వాత కీర్తి సురేష్ ఒప్పుకున్న తెలుగు సినిమా ఇదే కావటం విశేషం. మరో ప్రక్క కీర్తి సురేష్ ..మన్మధుడు 2 లో గెస్ట్ రోల్ చేస్తోందని వినికిడి.