మహానటి ఫెమ్ కీర్తి సురేష్ మహానటి తరువాత మరో వుమెన్ సెంట్రిక్ కాన్సెప్ట్ కు ఒకే చెప్పిన సంగతి తెలిసిందే. మహేష్ కోనేరు నిర్మిస్తున్న ఆ సినిమా షూటింగ్ ఇప్పటికే సగం పూర్తయ్యింది. ఏ మాత్రం తొందరపడకుండా కథలను ఎంచుకుంటున్న కీర్తి ఈ కథను వినగానే ఒకే చేసింది. 

సినిమాలో ఎమోషన్ తో పాటు మంచి మెస్సేజ్ కూడా ఉంటుందట. ఇకపోతే సినిమా యొక్క టైటిల్ పై ప్రస్తుతం సోషల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. మిస్ ఇండియా అనే టైటిల్ ను చిత్ర యూనిట్ ఒకే చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. నరేంద్ర ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. 

ఈ ప్రాజెక్ట్ పై నిర్మాత కంటే ఎక్కువగా కీర్తి నమ్మకం పెట్టుకుందట. మహానటి తరువాత ఈ బేబీకి టాలీవుడ్ స్టార్ హీరోలతో అవకాశం వచ్చినప్పటికీ కథ నచ్చక రిజెక్ట్ చేసిన లిస్ట్ పెద్దగానే ఉంది. అందులో నాగార్జున సినిమా కూడా ఉన్నట్లు గతంలో రూమర్స్ వచ్చాయి. మరి బేబీ కేరీర్ గురించి ఎలా ఆలోచిస్తుందో తెలియదు గాని పాత్ర నచ్చకపోతే మాత్రం చేయనని మొహం మీదే చెప్పేస్తుందట.