మహానటి కీర్తిసురేష్ ఇప్పుడు నాటు పోజులతో మతిపోగొడుతుంది. తాజాగా ఈ బ్యూటీ చీరలో మేకప్ లేకుండా డీ గ్లామర్ లుక్‌లో కనిపించింది. అంతేకాదు ఆమె పంచుకున్న ఫోటో వైరల్ అవుతుంది.
కీర్తిసురేష్ ప్రస్తుతం `దసరా` చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమా మరో నాలుగు రోజుల్లో విడుదల కానుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొంటూ సందడి చేస్తుంది కీర్తిసురేష్. ఈ క్రమంలో ఆమె గ్లామర్ పోజులతో మైండ్ బ్లాక్ చేస్తుంది. ఆ మధ్య బట్టల సైజ్ తగ్గించి షాకిచ్చిన ఈ భామ చీరలోనే హాట్ పోజులతో మతిపోగొట్టింది. ఈ నేపథ్యంలో తాజాగా మరో నాటు పోజు పంచుకుంది. ఆమె చీరలో పల్లెటూరి మహిళగా కనిపించింది. పాత గుడెసె వద్ద అరుగుపై కూర్చొని ఊరమాస్ లుక్ ఇచ్చింది.
ఇందులో ఆమె ఇందులో ఎర్రని పచ్చి మిర్చీని నోట్లో పెట్టుకుని నాటు పోజులివ్వడం విశేషం. ఇందులో కీర్తిసురేష్ డీ గ్లామర్ లుక్‌లో ఉంది. `దసరా` సినిమాలో ఆమె డీ గ్లామర్‌తో కనిపించబోతున్న విషయం తెలిసిందే. వెన్నెల పాత్రలో కీర్తిసురేష్ నటిస్తుంది. అందులో భాగంగానే ఆ గెటప్‌లో దిగిన ఫోటోని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది కీర్తిసురేష్. ఇందులో ఆమె పేర్కొంటూ `శనివారం రాత్రి వెన్నెల లుక్ ఇలా ఉంది` అని పేర్కొంది. ఇక ఈ ఫోటోలో బ్లూ కలర్ చీర కట్టింది కీర్తిసురేష్. కాళ్లకి గొలుసు, రబ్బర్ చెప్పులు ధరించింది. పూర్తిగా పల్లెటూరి మహిళగా మారిపోయి ఆశ్చర్యపరుస్తుంది. వెన్నెల పాత్రలో పరకాయ ప్రవేశం చేసిందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఆమె ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
ఇక `దసరా` చిత్రం ప్రమోషన్‌లో భాగంగా ఓ ఆసక్తికర విషయం పంచుకుంది కీర్తిసురేష్. ఓ ఇంటర్వ్యూలో లవ్ బ్రేకప్ గురించి ఓపెన్ అయ్యింది. బ్రేకప్ చేదుగా ఉంటుందా, మందు చేదుగా ఉంటుందనే ప్రశ్నకి కీర్తి స్పందించింది. ఆమె బ్రేకప్ చేదుగా ఉంటుందని పేర్కొంది. అలాంటి బ్రేకప్ మీ జీవితంలో జరిగిందా అనే ప్రశ్నకి ఆమె స్పందిస్తూ లేదని నవ్వుతూ బదులిచ్చింది. పక్కనే ఉన్న హీరో నాని.. `మహానటి` అంటూ పంచ్ వేయడం విశేషం. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది. అయితే కీర్తిసురేష్ అంత స్పాంటినియస్‌గా బ్రేకప్‌పై స్పందించడం, బాధగా ఉంటుందని చెప్పడంతో ఈ అమ్మడు ఎక్కడో దెబ్బతిన్నదనే అభిప్రాయాన్ని నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. మరి నిజమెంటనేది తెలియాల్సి ఉంది.
ఇక `నేను లోకల్` తర్వాత నాని, కీర్తిసురేష్ జంటగా కలిసి నటిస్తున్న చిత్రమిది. శ్రీకాంత్ ఓడెల దర్శకత్వం వహించారు. ఉత్తర తెలంగాణలో బొగ్గుగనుల నేపథ్యంలో ఈ చిత్రం రూపొందింది. పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల చేస్తున్న `దసరా` మూవీ శ్రీరామనవమి సందర్భంగా మార్చి 30న విడుదల కాబోతుంది. ఈ సినిమా గురించి కీర్తి చెబుతూ, ఈ సినిమాలో నేను వెన్నెల అనే పల్లెటూరి అమ్మాయిగా కనిపిస్తా. సవాలుతో కూడుకున్న పాత్ర ఇది. మేకప్ కోసమే కొన్ని గంటల సమయం పట్టేది. సింగరేణి బొగ్గు గనుల్లో దుమ్ము, ధూళి నడుమ షూటింగ్ చేశాం.
సహాయ దర్శకులు, ఓ ప్రొఫెసర్ సహకారంతో తెలంగాణ యాసను బాగా ప్రాక్టీస్ చేశా. డబ్బింగ్ చెప్పే సమయానికి తెలంగాణ యాసపై పూర్తి పట్టు దొరికింది. ప్రతి సినిమాకు ఓ ఫీల్ ఉంటుంది. ఈ సినిమా పూర్తయిన తర్వాత చాలా భావోద్వేగానికి గురయ్యా. నా కెరీర్‌లో మరో గొప్ప చిత్రంగా మిగిలిపోతుందనే భావన కలిగింది. ఈ సినిమాలో ‘ఛమ్కీల అంగీలేసి’ పాట చాలా పాపులర్ అయింది. ఈ పాట విన్నప్పుడే ప్రతి పెళ్లిలో మార్మోగిపోతుందని అనుకున్నాం. తెలంగాణ జానపద గీతంలోని సొగసు ఏమిటో ఈ పాట ద్వారా నాకు తెలిసింది. లిరిక్స్ అర్థం తెలుసుకుంటే అద్భుతంగా అనిపించింది. బాలీవుడ్‌లో కొన్ని కథలు విన్నా. అంతగా నచ్చకపోవడంతో అంగీకరించలేదు. మంచి కథ దొరికితే హిందీలో నటిస్తా` అని చెప్పింది కీర్తిసురేష్.
