నేను శైలజా సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ మహానటి సినిమాతో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇకపోతే నెక్స్ట్ అమ్మడు పెద్ద సినిమాలనే టార్గెట్ చేస్తోంది. సర్కార్ సినిమాతో సౌత్ లో ఒక స్థానాన్ని సుస్థిరం చేసుకున్న మహానటి బ్యూటీ ఇప్పుడు బాలీవుడ్ లో ఒక బంపర్ అఫర్ ని పట్టేసినట్లు సమాచారం. 

అజయ్ దేవగన్ నెక్స్ట్ చేయబోయే రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ సినిమాలో కీర్తి సురేష్ నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదివరకే బాలీవుడ్ నుంచి చాలా ఆఫర్స్ వచ్చినప్పటికీ కీర్తి ఒప్పుకోలేదు. ఇక రీసెంట్ గా అజయ్ ప్రాజెక్ట్ నచ్చడంతో సింగిల్ సిట్టింగ్ లో ఒప్పేసుకుంది. 

ఇదివరకు బాలీవుడ్ కల్ట్ క్లాసిక్ హిట్ బాధయి హో తో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అమిత్ శర్మ కీర్తి సురేష్ కొత్త కొత్త సినిమాని డైరెక్ట్ చేయనున్నాడు. త్వరలోనే సినిమా షూటింగ్ ను కూడా మొదలెట్టాలని దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడు. శ్రీదేవి భర్త బోణి కపూర్ ఈ సినిమాని నిర్మించనున్నారు.