Asianet News TeluguAsianet News Telugu

బాలీవుడ్ పై కన్నేసిన మహానటి బ్యూటీ?

ఒకే ఒక్క సినిమాతో కీర్తి సురేశం కెరీర్ ఊహించని విధంగా మారిపోయింది. సావిత్రి బయోపిక్ మహానటి అందించిన విజయం ఇప్పుడు సౌత్ లో ఆమెను బిజీగా మార్చేసింది. గతంలో ఎప్పుడు లేని విధంగా కీర్తి సురేష్ స్టార్ హీరోలతో వరుసగా అవకాశాలను అందుకుంటూ బాలీవుడ్ పై కూడా కన్నేసినట్లు తెలుస్తోంది. 

keerthy suresh bollywood debut
Author
Hyderabad, First Published Mar 3, 2019, 12:53 PM IST

ఒకే ఒక్క సినిమాతో కీర్తి సురేశం కెరీర్ ఊహించని విధంగా మారిపోయింది. సావిత్రి బయోపిక్ మహానటి అందించిన విజయం ఇప్పుడు సౌత్ లో ఆమెను బిజీగా మార్చేసింది. గతంలో ఎప్పుడు లేని విధంగా కీర్తి సురేష్ స్టార్ హీరోలతో వరుసగా అవకాశాలను అందుకుంటూ బాలీవుడ్ పై కూడా కన్నేసినట్లు తెలుస్తోంది. 

గత ఏడాది సర్కార్ సినిమాతో బాక్స్ ఆఫీస్ హిట్టందుకున్న కీర్తి ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ తో నటించడానికి కూడా రెడీ అవుతున్నట్లు టాక్. ఇకపోతే బాలీవుడ్ లో శ్రీదేవి భర్త బోనికపూర్ నిర్మించనున్న ఓ సినిమాకు కీర్తి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.‘బదాయి హో’ అనే సినిమాతో గత ఏడాది బాక్స్ ఆఫీస్ హిట్టందుకున్న అమిత్‌ శర్మ దర్శకత్వంలో ఆ హిందీ సినిమా తెరకెక్కనుందని సమాచారం. 

కథ వినగానే మహానటి బ్యూటీ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఇదివరకే కొన్ని బాలీవుడ్ కథలు కీర్తి దగ్గరకు వచ్చినప్పటికీ కథలు నచ్చకపోవడం వల్ల నో చెప్పిందట. బాలీవుడ్ లో మొదటి సినిమా ఓ రేంజ్ లో క్లిక్కవలని అమ్మడు సరైన కథ వచ్చేవరకు వెయిట్ చేసింది. ఇక ఇప్పుడు తన పాత్రకు మంచి స్కోప్ ఉన్న సినిమాకు ఒకే చెప్పి అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. మరి బాలీవుడ్ లో మొదటి సినిమా ఈ నటికి ఎలాంటి విజయాన్ని ఇస్తుందో చూడాలి.  

Follow Us:
Download App:
  • android
  • ios