జవాన్ మూవీపై కీర్తి సురేష్ స్పెషల్ పోస్ట్.. 'షారుఖ్' చిత్రాన్ని మహానటి ఎలా సెలెబ్రేట్ చేసుకుంటుందో చూశారా ?
నేడు జవాన్ మూవీ వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయింది. తొలి షో నుంచే అట్లీ, షారుఖ్, నయనతార చిత్రానికి పాజిటివ్ రిపోర్ట్స్ మొదలయ్యాయి.

కింగ్ ఖాన్ షారుఖ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'జవాన్'. పఠాన్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కావడంతో జవాన్ చిత్రంపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. పైగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది సౌత్ డైరెక్టర్ అట్లీ. జవాన్ రిలీజ్ డేట్ సెప్టెంబర్ 7 కోసం ఇండియా వ్యాప్తంగా ఆడియన్స్ మొత్తం ఎదురుచూస్తున్నారు. ఆ తరుణం గ్రాండ్ లెవల్ లో వచ్చేసింది.
నేడు జవాన్ మూవీ వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయింది. తొలి షో నుంచే అట్లీ, షారుఖ్, నయనతార చిత్రానికి పాజిటివ్ రిపోర్ట్స్ మొదలయ్యాయి. క్రిటిక్స్ కూడా పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. ఇక మిగిలింది బాక్సాఫీస్ జాతరే అని ప్రేక్షకులు అంటున్నారు.
జవాన్ చిత్రం కోసం ఆడియన్స్ మాత్రమే కాదు సెలెబ్రిటీలు సైతం ఆసక్తిగా ఎదురుచూసారు. వారిలో మహానటి కీర్తి సురేష్ కూడా ఉంది. జవాన్ చిత్ర రిలీజ్ ని కీర్తి సురేష్ దర్శకుడు అట్లీ, అతని భార్య ప్రియాతో కలసి గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకుంది. ఆ దృశ్యాలని కీర్తి సురేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సెప్టెంబర్ 7 స్పెషల్ డే.. ఎందుకంటే ఈ ప్రపంచం నీ మ్యాజిక్ ని చూడబోతోంది అట్లీ.
ఈ చిత్రంపై నా ఆసక్తి ఇప్పుడు తారాస్థాయిలో ఉంది. అనిరుద్ మ్యూజిక్ వర్క్ ని చూడబోతున్నా. కింగ్ ఖాన్ ని కొత్త అవతారంలో చూసేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. మతి పోగొట్టే నీ పెర్ఫామెన్స్ ని ఎంజాయ్ చేసేందుకు సిద్ధం గా ఉన్నాం సర్. జవాన్ చిత్రానికి నా ప్రేమ అంటూ కీర్తి సురేష్ బ్యూటిఫుల్ పోస్ట్ చేసింది.