కీర్తిసురేష్‌ అలాంటి ట్రెండ్‌కి శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం ఆమె `గాంధారీ` అనే పాటలో నర్తించింది. కలర్‌ఫుల్‌గా డిజైన్‌ చేసిన సెట్‌లో, ఇతర డాన్సర్లతో కలిసి కీర్తిసురేష్‌ ఈ `గాంధారీ` పాటకి డాన్సులు చేసింది. 

`మహానటి` ఫేమ్‌ కీర్తిసురేష్‌(Keerthy Suresh) టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్‌ని సృష్టిస్తుంది. ఇటీవల మహేష్‌బాబు సినిమాలో `కళావతి` అంటూ కనువిందు చేసిన ఈ అందాల భామ ఇప్పుడు ఇండిపెండెంట్‌ వీడియో సాంగ్‌తో దుమారం రేపుతుంది. తాజాగా Keerthy Suresh స్పెషల్‌ వీడియో సాంగ్‌ ట్రెండ్‌ని టాలీవుడ్‌లోకి తీసుకొచ్చింది. జనరల్‌గా ఈ ట్రెండ్‌ బాలీవుడ్‌లో ఉంటుంది. స్టార్‌ హీరోయిన్లు ఇలాంటి స్పెషల్‌ సాంగ్స్ లో నటిస్తుంటారు. హీరోలు సైతం యాక్ట్ చేస్తుంటారు. జాక్వెలిన్‌, కత్రినా కైఫ్‌, కరీనా, రష్మిక మందన్నా సైతం బాలీవుడ్‌లో స్పెషల్‌ వీడియో సాంగ్స్ చేశారు. అవి ట్రెండింగ్‌ అవుతుంటాయి. 

తాజాగా కీర్తిసురేష్‌ అలాంటి ట్రెండ్‌కి శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం ఆమె `గాంధారీ`(Gandhari Video Song) అనే పాటలో నర్తించింది. కలర్‌ఫుల్‌గా డిజైన్‌ చేసిన సెట్‌లో, ఇతర డాన్సర్లతో కలిసి కీర్తిసురేష్‌ ఈ `గాంధారీ` పాటకి డాన్సులు చేసింది. అద్భుతమైన డాన్సులతో మతిపోగొడుతుంది. తాజాగా ఈ పాటని సాయంత్రం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో విడుదల చేశారు. ఇప్పుడీ Gandhari పాటకి విశేష స్పందన లభిస్తుంది. విడుదలైన కాసేపట్లోనే ట్రెండ్‌లోకి వెళ్లింది. లక్షల వ్యూస్‌ వస్తున్నాయి. 

YouTube video player

ఇందులో లెహంగా ఓణీలో కీర్తిసురేష్‌ సైతం కనువిందు చేస్తుంది. అభిమానుల మైండ్‌బ్లాక్‌ చేస్తుంది. నెవర్‌ బిఫోర్‌ అనేలా డాన్సులు చేయడం విశేషం. ఈ వీడియో సాంగ్‌ బాలీవుడ్‌లో సంజయ్‌ లీలా భన్సాలీ చిత్రాల్లోని పాటని తలపిస్తుండటం విశేషం. బ్రిందా మాస్టర్‌ ఈ పాటకి కొరియోగ్రఫీతోపాటు దర్శకత్వం వహించారు. ఈ పాటని సుద్దాల అశోక్‌ తేజ రాయడం విశేషం. పవన్‌ సీహెచ్‌ సంగీతం సమకూర్చారు. అనన్య భట్‌ ఆలపించారు. ది రూట్‌ ప్రొడక్షన్‌ నిర్మించగా, ఇది సోనీ మ్యూజిక్‌ ద్వారా యూట్యూబ్‌లో విడుదలైంది.

ఇదిలా ఉంటే కీర్తిసురేష్‌ ప్రస్తుతం తెలుగులో మహేష్‌ బాబు సరసన `సర్కారువారి పాట` చిత్రంలో కథానాయికగా నటిస్తుంది. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తుంగా, థమన్‌సంగీతం అందిస్తున్నారు. బ్యాంకు కుంభకోణాల నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం మే 12న విడుదల కానుంది. మరోవైపు చిరంజీవితో `భోళాశంకర్‌` చిత్రంలో ఆయనకు చెల్లిగా నటిస్తుంది. మరోవైపు నానితో `దసరా` చిత్రంలో కథానాయికగా నటిస్తుంది. తమిళంలో `సాని కయిదమ్‌`, మలయాళంలో `వాషి` చిత్రాల్లో నటిస్తుంది.