హగ్ ఇచ్చి మరీ గుర్తు చేసేదట!

హగ్ ఇచ్చి మరీ గుర్తు చేసేదట!

మలయాళీ బ్యూటీ కీర్తి సురేష్ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ హోదాకు అతి దగ్గరలో ఉంది. వరుస సినిమాలు చేస్తూ హిట్స్ అందుకుంటోన్న ఈ భామ రీసెంట్ గా మహానటితో మరో భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పటివరకు కమర్షియల్, లవ్ స్టోరీస్ లో కనిపించిన కీర్తి మహానటితో మరో మెట్టు ఎక్కింది. సావిత్రి పాత్రలో ఆమె ఒదిగిపోయిందని మరో నటిని ఆ పాత్రలో ఊహించలేమంటూ ప్రేక్షకులు ఆమెను పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు.

ఇంతగా ప్రశంసలు దక్కించుకోవడానికి కీర్తి కూడా బాగానే కష్టపడింది. ప్రతి విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకునేదట. సినిమా షూటింగ్ లో ప్రతిరోజు సినిమాటోగ్రాఫర్ దగ్గరకు వెళ్లి హగ్ చేసుకొని పలకరించిన తరువాత నన్ను లావుగా చూపించడం మర్చిపోవద్దు అంటూ గుర్తుచేసేదట. తాజాగా ఈ విషయాన్ని గుర్తుచేసుకున్న సినిమాటోగ్రాఫర్ డాని సాంచేజ్.. లావుగా చూపించమని అడిగిన ఏకైక హీరోయిన్ కీర్తి సురేష్ మాత్రమేనని అన్నాడు. అదన్నమాట కీర్తి హగ్ స్టోరీ.. 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos