MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Funky Day 2 Collections: నాగవంశీకి అసలు కష్టాలు స్టార్ట్.. `ఫంకీ` రెండు రోజుల కలెక్షన్లు

Funky Day 2 Collections: నాగవంశీకి అసలు కష్టాలు స్టార్ట్.. `ఫంకీ` రెండు రోజుల కలెక్షన్లు

అనుదీప్‌ రూపొందించిన `ఫంకీ` మూవీ శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే. విశ్వక్‌ సేన్‌, కయాదు లోహర్‌ జంటగా నటించిన ఈ మూవీ రెండు రోజులు కలెక్షన్లు ఎంత వచ్చాయంటే? 

2 Min read
Author : Aithagoni Raju
Published : Feb 15 2026, 04:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఫంకీ మూవీలో ఇదే మైనస్‌
Image Credit : X/@SitharaEnts

ఫంకీ మూవీలో ఇదే మైనస్‌

విశ్వక్‌ సేన్‌, కయాదు లోహర్‌ జంటగా, అనుదీప్‌ కేవీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం `ఫంకీ`. నాగవంశీ నిర్మించిన ఈ సినిమాని పూర్తిగా డైలాగ్‌ కామెడీని నమ్ముకుని రూపొందించారు. అనుదీప్‌ మార్క్ పంచ్‌ డైలాగ్‌లు ఇందులో హైలైట్‌గా నిలిచాయి. దీనికితోడు మదర్‌ ఎమోషన్ కూడా ఆకట్టుకుంది. అయితే సినిమాలో కథ లేదు. కథనంలో కూడా ఓ క్లారిటీ లేదు. ఇష్టా రాజ్యంగా మూవీని తెరకెక్కించినట్టుగా ఉంది. ఇదే సినిమాకి పెద్ద ఎఫెక్ట్ అయ్యింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
`ఫంకీ` మూవీ కలెక్షన్లు
Image Credit : Asianet News

`ఫంకీ` మూవీ కలెక్షన్లు

కామెడీ అన్ని చోట్ల వర్కౌట్‌ కాలేదు. ఫస్టాఫ్‌లో బలవంతంగా కామెడీ డైలాగ్‌లు పెట్టినట్టు ఉంది. సెకండాఫ్‌లో ఫర్వాలేదు. క్లైమాక్స్ ఎమోషనల్‌గా ఉంది. కానీ అవి మాత్రమే ఆడియెన్స్ కి సరిపోవు. అయినప్పటికీ ఈ మూవీకి  మంచి వసూళ్లు వస్తుండటం విశేషం. టాలీవుడ్‌ టూ బాలీవుడ్‌ సైట్‌ అందించిన లెక్కల ప్రకారం.. మొదటి రోజు ఈ చిత్రం రూ.4.5కోట్లు వసూలు చేసింది. ఊహించిన దానికంటే ఎక్కువే వచ్చాయి. టాక్‌తో సంబంధం లేకుండా మంచి ఓపెనింగ్స్ ని సాధించింది. కానీ రెండో రోజు మాత్రం ఆ ప్రభావం కనిపించింది. సగానికి పడిపోయింది.

34
ఫంకీ మూవీ రెండో రోజు కలెక్షన్లు
Image Credit : X/@SitharaEnts

ఫంకీ మూవీ రెండో రోజు కలెక్షన్లు

ఫంకీ మూవీ రెండో రోజు కలెక్షన్లు చూస్తే, దాదాపు రెండు కోట్లు వసూలు చేసింది. మొదటి రోజుతో పోల్చితే సగం మాత్రమే వచ్చాయని చెప్పొచ్చు. మొత్తంగా రెండు రోజుల్లో రూ.6.55కోట్లు వసూలు చేసింది. నైజాంలో రూ.1.15కోట్లు, ఏపీలో కోటి, ఓవర్సీస్‌, ఇతర స్టేట్స్ అన్ని కలిపి రూ.1.25కోట్లు వసూలు చేసింది. ఇలా రెండో రోజుల్లో రూ.3.40కోట్ల షేర్‌, ఆరున్నర కోట్ల గ్రాస్‌ వచ్చింది.

44
`ఫంకీ` బ్రేక్‌ ఈవెన్‌ కావాలంటే
Image Credit : Asianet News

`ఫంకీ` బ్రేక్‌ ఈవెన్‌ కావాలంటే

ఈ సినిమాకి ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ సుమారు రూ.13కోట్లు అయ్యింది. అంటే రూ.14కోట్లు వస్తే బ్రేక్‌ ఈవెన్‌ అవుతుంది. సినిమాకి అయిన బడ్జెట్‌ రూ.25కోట్లు అని సమాచారం. ఇప్పుడు వచ్చిన కలెక్షన్లని బట్టి చూస్తే, బ్రేక్‌ ఈవెన్‌ కావడానికి ఇంకా రూ.పది కోట్లకుపైగా షేర్‌ రావాలి. ఇరవై కోట్లకుపైగా గ్రాస్‌ వసూలు చేయాలి. ఈ చిత్రం ఆదివారం బాగానే వసూలు చేసే ఛాన్స్ ఉంది. కానీ సోమవారం నుంచి అసలు పరీక్ష ఉండబోతుంది. ఇటీవల `అనగనగా ఒక రాజు` మూవీతో హిట్‌ అందుకున్నారు నాగవంశీ. ఇప్పుడు `ఫంకీ` రూపంలో గట్టి దెబ్బ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సోమవారం నుంచి వచ్చే కలెక్షన్లు ఈ మూవీని జాతకాన్ని తేల్చనున్నాయి. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: టీ కప్పులే కడగలేవు, బిగ్ బాస్ కప్పు ఏం కొడతావ్.. రోహిత్ పరువు తీసిన వంశీ
Recommended image2
RC17: ధురంధర్ మ్యూజిక్ డైరెక్టర్ తో డీల్ కుదర్లేదా ? సుకుమార్, రామ్ చరణ్‌ మూవీ కోసం అనిరుధ్
Recommended image3
Rashmi Gautam: రష్మి గౌతమ్‌ నవరాత్రి స్పెషల్ ఫొటోషూట్..ట్రెడిషనల్ లుక్ లో మెస్మరైజ్ చేస్తోందిగా
Related Stories
Recommended image1
Funky Review: `ఫంకీ` మూవీ రివ్యూ, రేటింగ్‌.. విశ్వక్‌ సేన్‌, అనుదీప్‌ల కామెడీ సినిమా నవ్వించిందా?
Recommended image2
Balakrishna రిజెక్ట్ చేసిన సినిమాలతో ఇండస్ట్రీ హిట్లు కొట్టిన రాజశేఖర్‌.. బాలయ్యకి ఊహించని దెబ్బ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved