ఖచ్చితంగా ఇంట్లో ఒప్పించే పెళ్లి చేసుకుంటాను : కీర్తి సురేష్

Keerthi about her marraige
Highlights

ఖచ్చితంగా ఇంట్లో ఒప్పించే పెళ్లి చేసుకుంటాను : కీర్తి సురేష్

అలనాటి మేటి కథానాయిక సావిత్రి జీవిత చరిత్రతో దర్శకుడు నాగ్ అశ్విన్ 'మహానటి' చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ రావడంతో చిత్రబృందం సంబరాలలో మునిగితేలుతున్నారు. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ ఒదిగిపోయిందని ఆమె తప్ప మరెవరూ ఈ పాత్రకు న్యాయం చేయలేరనేంతగా ప్రేక్షకులపై ప్రభావం చూపింది.  నిన్న మొన్నటి వరకు అవకాశాలు రావడమే గగనమైన తరుణంలో మహానటి ఇచ్చిన ఘనవిజయంతో అవకాశాల మీద అవకాశాలు కీర్తి గుమ్మం ముందు క్యూ కడుతున్నాయి. అయితే, ఒ ప్రముఖ ఛానెల్ కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో తన పెళ్లి గురించి చెప్పుకొచ్చింది కీర్తి.

ఆమె మాట్లాడుతూ " దర్శకత్వం చేసే అర్హతలు కానీ టాలెంట్ కానీ నాదగ్గర లేవు.అభిమానులు నన్ను ఆదరించేవరకు సినిమాలలో నటిస్తాను.ఆ తర్వాత పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోతా .అయితే నాది మాత్రం ప్రేమ పెళ్లి .నేను ఖచ్చితంగా ఇంట్లో ఒప్పించే చేసుకుంటాను అని అమ్మడు బాంబ్ పేల్చింది. మొన్నామధ్య యువహీరోతో ప్రేమలో మునిగితేలుతుందని రూమర్లు కూడా వచ్చాయి. మరి అతను ఎవరో చెప్పలేదు.

loader