ఎన్టీఆర్ బయోపిక్ సెకండ్ పార్ట్ ఫైనల్ గా రేపు విడుదలకు సిద్ధమవుతోన్న సంగతి తెలిసిందే. అయితే సినిమాకు సంబందించిన ఎలాంటి ప్రమోషన్స్ ను చిత్ర యూనిట్ పెద్దగా టచ్ చేయడం లేదు. సంగీత దర్శకుడు ఎమ్ఎమ్. కీరవాణి కూడా చాలా వరకు సైలెంట్ అయిపోయారు. మొన్నటివరకు మహానాయకుడు ఎడిటింగ్ లో ఆయన కూడా బిజీగా గడిపారు. 

కొన్ని సీన్స్ విషయంలో హెవీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం కీరవాణి చాలా శ్రమించినట్లు తెలుస్తోంది. అయితే ఫైనల్ గా సినిమా ఫైనల్ అవుట్ ఫుట్ రావడంతో కీరవాణి తన వరకు సినిమా రిజల్ట్ పై పాజిటివ్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మొత్తానికి మహానాయకుడి పని మొత్తం ఫినిష్ అయ్యింది. నెక్స్ట్ కీరవాణి పూర్తిగా RRRపై ద్రుష్టి పెట్టనున్నారు. 

ఈ సినిమా కారణంగా కీరవాణి ఇతర సినిమాలను ఒకే చేయడం లేదు. ఈ బడా మల్టీస్టారర్ కోసం కీరవాణి కొత్త టెక్నీక్ తో సరికొత్త మ్యూజిక్ చేయనున్నారు అని టాక్. ప్రస్తుతం సినిమా సెకండ్ షెడ్యూల్ నడుస్తోంది. చరణ్ తో దర్శకుడు రాజమౌళి కొన్ని యాక్షన్ సీన్స్ ను తెరకెక్కిస్తున్నాడు. మొన్నటి వరకు హాలిడేస్ లో ఉన్న తారక్ ఇప్పుడు చిత్ర యూనిట్ తో కలిసేందుకు సిద్ధమయ్యారు. 300 కోట్ల బారి బడ్జెట్ తో డివివి.దానయ్య ఈ సినిమాను నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే.