Asianet News TeluguAsianet News Telugu

''యుద్ధానికి దూరంగా ఉండండి''..ఎవరికా వార్నింగ్?

 దీనికి ''నిశ్శబ్ధాన్ని పాటిస్తూ.. యుద్ధానికి దూరంగా ఉండండి'' అనే క్యాప్షన్ జోడించింది. ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా అక్టోబరు 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 

Keep calm and avoid the battle vijay warning to other movies? jsp
Author
First Published Sep 18, 2023, 9:00 AM IST


 విజయ్‌ (Vijay) హీరోగా దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ (Lokesh Kanagaraj) తెరకెక్కిస్తున్న చిత్రం ‘లియో’ (Leo) ఏ రేంజిలో క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. విడుదలకు నెలపైనే సమయం ఉన్నా.. ఇప్పటికే అక్కడ అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ఓపెన్‌కాగా 24 గంటల్లోనే 10వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోవడం విశేషం.  ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, టైటిల్‌ ప్రోమో గ్లింప్స్ వీడియో మూపై భారీగా హైప్ క్రియేట్ చేశాయి. తాజాగా లియో తెలుగు పోస్టర్‌ను లాంఛ్ చేశారు మేకర్స్‌. ఇందులో విజయ్ కూల్‌గా, స్టైలిష్‌గా ఉన్న లుక్ నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఈ పోస్టర్ ను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీనికి ''నిశ్శబ్ధాన్ని పాటిస్తూ.. యుద్ధానికి దూరంగా ఉండండి'' అనే క్యాప్షన్ జోడించింది. ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా అక్టోబరు 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

కథలో యుద్దం అనేది ప్రక్కన పెడితే...ఇంతకీ ఈ సినిమాతో యుద్దానికి వస్తున్నారో చూద్దాం.   దసరా పండుగ రోజున తెలుగులో స్ట్రెయిట్ గా  బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’, రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’లతో ‘లియో’ పోటీ పడనుంది. మూడు సినిమాలకు భారీ బజ్ ఉంది.  ఈ త్రిముఖ పోటీలో ‘లియో’ఏ స్దాయిలో  నిలబడుతుంది?  అనేది ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. 

త్వరలోనే ఈ మూవీ ప్రమోషన్స్ కూడా షురూ చేయనుంది లోకేశ్‌ కనగరాజ్ టీం. ఇందులో భాగంగానే లియో ఆడియో లాంఛ్ ఈవెంట్‌ను సెప్టెంబర్ 30 లేదా అక్టోబరు 01 నిర్వహించేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై చిత్రయూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.  ఈ సినిమా రా వెర్షన్‌ (అన్‌కట్‌ వెర్షన్‌)ను యూకేలో విడుదల చేస్తున్నట్లు పంపిణీ సంస్థ అహింసా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది. దర్శకుడు లోకేశ్‌ విజన్‌ను దృష్టిలో పెట్టుకుని, ఒక్క విజువల్‌ కూడా ప్రేక్షకులు మిస్‌కాకుడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. తాము ఊహించిన స్థాయిలో సినిమాకి స్పందన వచ్చిన తర్వాత 12A (12 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసు కలిగిన వారు) ఫ్రెండ్లీ వెర్షన్‌ రిలీజ్‌ చేస్తామని పేర్కొంది.  

థియేటర్లలో రిలీజ్ తర్వాత  రూ.500 కోట్ల నుంచి రూ.600 కోట్ల వరకు కలెక్షన్లను ఈ మూవీ సాధించగలదని అంచనా. పాజిటివ్ టాక్ వస్తే 2.0 రికార్డును (రూ.810 కోట్లు) పైతం ‘లియో’ బ్రేక్ చేస్తుందని భావిస్తున్నారు. విజయ్ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. 7 స్క్రీన్ స్టూడియో బ్యానర్‌పై లలిత్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘విక్రమ్‌’లాంటి సూపర్‌హిట్‌ తర్వాత లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రంకావడం, ‘మాస్టర్‌’ తర్వాత లోకేశ్‌- విజయ్‌ కాంబోలో రూపొందుతున్న సినిమాకావడంతో ‘లియో’పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

 యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్. లియోలో యాక్షన్‌ కింగ్ అర్జున్ హెరాల్డ్‌ దాస్‌గా, సంజయ్‌ దత్‌ ఆంటోనీ దాస్‌గా నటిస్తున్నారు. వీరిద్దరికి సంబంధించిన గ్లింప్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ మూవీలో  ప్రియా ఆనంద్‌, మలయాళ నటి శాంతి మాయాదేవి, మన్సూర్ అలీఖాన్‌, గౌతమ్ వాసు దేవ్‌మీనన్‌, మిస్కిన్‌, మాథ్యూ థామస్‌, సాండీ తదితరులు కీ రోల్స్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని సెవెన్‌ స్క్రీన్‌ స్టూడియోపై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు  అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios