బాలీవుడ్ లో ఇప్పుడు ఎక్కువగా నిజ జీవిత ఆధారంగా రాసుకున్న కథలే తెరపైకి ఎక్కువగా వస్తున్నాయి. బయోపిక్ లు అంటూ స్టార్ హీరోలు చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. ఇక కొన్ని ఇన్సిడెంట్స్ పై మీడియం బడ్జెట్ సినిమాలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు కేదార్ నాథ్ వరదల నేపథ్యంలో తెరకెక్కిన కేదార్ నాథ్   ట్రైలర్ తోనే అందరిని ఆకర్షిస్తోంది. 

సుశాంత్ సింగ్ రాజ్ పుత్.. సారా ఆలీఖాన్ హీరో హీరోయిన్లు గా నటిస్తున్న ఈ సినిమాకు అభిషేక్ కపూర్ దర్శకత్వం వహించాడు. ముస్లిం అబ్బాయి - హిందూ యువతీ ప్రేమించుకోవడం వారి ప్రేమను పెద్దలు తిరస్కరించడం కామన్ పాయింట్ అయినప్పటికీ కేధార్ నాథ్ అందాలను బాగానే చూపించారు. 

ఇక ప్రళయం వచ్చినా ఈ పెళ్లికి ఒప్పుకోను అని హీరోయిన్ తండ్రి చెప్పగానే.. ప్రళయం రావాలని కోరుకుంటున్నా అని కథానాయిక కోరుతుంది. దాదాపు కథ ఏంటో అర్ధమయిపోయింది. వరదలకు సంబందించిన సన్నివేశాలను చాలా బాగా చుపించారనిపిస్తోంది.ప్రకృతి వలయంలో ప్రేమ జంట ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంది ప్రకృతే వారికీ శత్రువా? అనే సందేహాలను కలిగించారు. 

ట్రైలర్ లో రెండు మూడు సీన్లతోనే చిత్రం తెగ ఆకర్షిస్తోంది. ఇక మరోవైపు సినిమాపై ఆరోపణలు వస్తోన్న సంగతి తెలిసిందే. పవిత్రమైన కేదార్ నాథ్ లో ప్రేమ ఏమిటని మండిపడుతున్నారు. మరి డిసెంబర్ 7న రానున్న ఈ సినిమా ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.