పుణ్యక్షేత్రంలో ఈ రొమాన్స్ ఏంటి..? సినిమాపై ఫైర్!

చార్ దామ్ పుణ్యక్షేత్రాలలో 'కేథార్‌నాథ్‌' ఒకటి. ఈ పుణ్యక్షేత్రం పేరుతో బాలీవుడ్ లో ఓ సినిమా తెరకెక్కుతోంది. సుశాంత్ రాజ్ పుత్ హీరోగా దర్శకుడు అభిషేక్ కపూర్ ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాతో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీఖాన్ బాలీవుడ్ కి పరిచయం కానుంది.

Kedarnath movie lands in soup, priests demand blanket ban

చార్ దామ్ పుణ్యక్షేత్రాలలో 'కేథార్‌నాథ్‌' ఒకటి. ఈ పుణ్యక్షేత్రం పేరుతో బాలీవుడ్ లో ఓ సినిమా తెరకెక్కుతోంది. సుశాంత్ రాజ్ పుత్ హీరోగా దర్శకుడు అభిషేక్ కపూర్ ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాతో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీఖాన్ బాలీవుడ్ కి పరిచయం కానుంది.

ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. డిసంబర్ 7న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ సినిమాను విడుదల కానివ్వమని కేథార్‌నాథ్‌ ఆలయ పూజారులు మండిపడుతున్నారు. 

హిందువుల మనోభావాలు దెబ్బ తీసే విధంగా ఈ సినిమా ఉందని.. లవ్ జీహాదీని ప్రమోట్ చేసేలా టీజర్ ఉందని అంటున్నారు. కేథార్‌నాథ్‌ కి ముస్లింలు రారని అలాంటిది ముస్లిం అబ్బాయితో హిందూ అమ్మాయి ప్రేమలో పడినట్లు ఎలా చూపిస్తారని ప్రశ్నిస్తున్నారు.

కేథార్‌నాథ్‌ లో వరదల కారణంగా వేల మంది మరణిస్తుంటే.. హీరో, హీరోయిన్ల మధ్య అధర చుంబన దృశ్యాలు ఏంటి..? ఈ సినిమాని నిషేధించాలి అంటూ నినాదాలు చేస్తున్నారు. సినిమాను బ్యాన్ చేయకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios