Asianet News TeluguAsianet News Telugu

ఈటల-కేసీఆర్ ఎపిసోడ్... వెన్నుపోటు టైటిల్ తో వర్మ సంచలన చిత్రం!

తాజా Ram gopal varma ప్రకటన రాజకీయ వర్గాలలో కలకలం రేపుతోంది. ముఖ్యంగా ప్రతిష్టాత్మక హుజురాబాద్ ఎన్నికలకు ముందు etala rajendar ఇమేజ్ డామేజ్ చేసేదిగా వర్మ ప్రకటన ఉండడడంతో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. 

kcr etala rajendar episode ram gopal varma movie with vennupotu title
Author
Hyderabad, First Published Oct 19, 2021, 9:44 AM IST

హుజురాబాద్ ఉప ఎన్నికల హీట్ కొనసాగుతుండగా... మధ్యలో వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సెన్సేషనల్ ప్రకటన చేశారు. ఆయన వెన్నుపోటు టైటిల్ తో మూవీ ప్రకటించారు. బీజేపీ నేత ఈటల రాజేందర్ సీఎం కేసీఆర్ కి ఎలా వెన్నుపోటు పొడిచాడు, అనేదే ఈ సినిమా కథనం అంటున్నారు. 

KCR గవర్నమెంట్ లో మంత్రిగా ఉన్న హుజూరాబాద్ మాజీ శాసనసభ్యుడు ఈటల రాజేందర్ ఆ పార్టీని నుండి బయటికి వచ్చిన విషయం తెలిసిందే. భూముల ఆక్రమణ ఆరోపణలు ఎదుర్కొన్న ఈటల సొంత పార్టీ నుండే వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. తనపై కేసీఆర్ కుట్ర పన్నారని ఆరోపించిన ఈటల... TRS పార్టీకి, ఆ పార్టీ తరపున గెలిచిన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అనంతరం ఆయన బీజేపీలో చేరడం జరిగింది. 


ఈటల రాజీనామా చేసిన హుజురాబాద్ అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. అక్టోబర్ 30న పోలింగ్ జరగనుంది. Huzurabad bypoll ను అధికార టీఆర్ఎస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎన్నికలలో గెలవడం ద్వారా తాను ఏ తప్పు చేయలేదని నిరూపించుకుంటానని,. కేసీఆర్ పై ప్రజాక్షేత్రంలో గెలిచి తానేమిటో నిరూపిస్తా అని ఈటల సవాల్ విసిరారు. ఈటల నియోజకవర్గంలో పాదయాత్ర కూడా చేయడం విశేషం. మరోవైపు టీఆర్ఎస్ నేతలు నియోజకవర్గంలో జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. 


ఇదిలా ఉంటే రామ్ గోపాల్ వర్మ... ఈటల-కేసీఆర్ ఎపిసోడ్ ని చంద్రబాబు-ఎన్టీఆర్ ఎపిసోడ్ తో పోల్చారు. గతంలో చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచి పదవి ఎలా సొంతం చేసుకున్నారో... ఈటల కూడా అలాంటి ప్రయత్నమే చేశారనిపిస్తుంది. అందుకే కేసీఆర్- ఈటల వెన్నుపోటు ఎపిసోడ్ పై తెలంగాణా రాజకీయ మేధావులతో చర్చించి... మూవీ చేస్తానంటూ ప్రకటించారు. అలాగే ఈటల, కేసీఆర్ మార్ఫింగ్ ఫొటోలతో వెన్నుపోటు టైటిల్ తో ఓ పోస్టర్ విడుదల చేశారు. 

Also read ప్రకాష్ రాజ్ కు షాక్.. నేను రాను, కోర్టుకి వెళ్ళమంటున్న ఎన్నికల అధికారి
తాజా Ram gopal varma ప్రకటన రాజకీయ వర్గాలలో కలకలం రేపుతోంది. ముఖ్యంగా ప్రతిష్టాత్మక హుజురాబాద్ ఎన్నికలకు ముందు etala rajendar ఇమేజ్ డామేజ్ చేసేదిగా వర్మ ప్రకటన ఉండడడంతో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో వర్మ మూవీ తెరకెక్కించారు. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి ఎంట్రీ తర్వాత జరిగిన పరిణామాలు, చంద్రబాబు నేతృత్వంలో సొంత కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ పై చేసిన మానసిక దాడి వంటి విషయాలు ఆ సినిమాలో వర్మ చూపించారు. 
లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలకు అనేక ఆటంకాలు ఎదురైనా... వర్మ పట్టుబట్టి ఆ సినిమా విడుదల చేశారు. మరి తాజా వెన్నుపోటు చిత్రంలో వర్మ ఎలాంటి విషయాలు ప్రస్తావిస్తారు.. ఈటల, కేసీఆర్ లలో ఎవరి క్యారెక్టర్ ని విలన్ ని చేస్తాడో చూడాలి. 

Also read ఫ్యామిలీ ప్లానింగ్ కోసం షారుక్ మూవీ వదులుకున్న సమంత!
 

Follow Us:
Download App:
  • android
  • ios