బిగ్ బాస్ సీజన్ 2లో కంటెస్టంట్ గా పాల్గొన్న కౌశల్ విజేతగా నిలిచాడు. అతడి కోసం కౌశల్ ఆర్మీ తయారైంది. కౌశల్ హౌస్ నుండి బయటకి వచ్చిన తరువాత కౌశల్ ఆర్మీ పేరుతో ఫౌండేషన్ మొదలుపెట్టి సేవలు చేస్తున్నారు. ఈ ఫౌండేషన్ కి కౌశల్ ఆర్మీ సభ్యులు కూడా విరాళాలు ఇచ్చారు.

అయితే ఈ మొత్తాన్ని కౌశల్ దుర్వినియోగం చేస్తున్నాడని, అతడికి డబ్బు పిచ్చి అంటూ కొందరు కౌశల్ ఆర్మీ సభ్యులు మీడియాకెక్కారు. దీంతో కౌశల్ పై సోషల్ మీడియాలో నెగెటివిటీ ఎక్కువైంది. దీంతో కౌశల్ ఈ విషయంపై క్లారిటీ ఇస్తూ తాజాగా మీడియా ముందు కొన్ని కామెంట్స్ చేశారు. 

మూడు నెలల క్రితం స్థాపించిన కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ గురించి అన్ని వివరాలు జెన్యూన్ గా ఉన్నాయని, ప్రతీ ఒక్క రూపాయికి లెక్క ఉందని.. కావాలంటే ఎవరైనా ఆడిటింగ్ చేసుకోవచ్చని అన్నారు. తాను డబ్బు మనిషిని కాదని, ఆధారాలు లేకుండా ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు అంటూ మండిపడ్డారు.

బిగ్ బాస్ గేమ్ ని ఎంతో కష్టపడి గెలిచినట్లు చెప్పిన కౌశల్ ఓ మీడియా సంస్థ తన గురించి తప్పుడు ప్రచారం చేస్తోందని అన్నారు. ఇరవై ఏళ్లు కష్టపడి తాను ఈ స్థానానికి వచ్చినట్లు..గిట్టని వారు కావాలని తనను బ్యాడ్ చేస్తున్నారని అన్నాడు.

తనతో సినిమా తీస్తామని చెప్పి మోసం చేశారని కౌశల్ వాపోయాడు. తన కుటుంబాన్ని కూడా వదిలి  కౌశల్ ఆర్మీ కోసం పని చేస్తున్నా అంటూ చెప్పుకొచ్చాడు.  

కౌశల్ ఆర్మీ ఆరోపణలపై కౌశల్ రెస్పాన్స్!