పవన్ కళ్యాణ్ ని స్పూర్తిగా చేసుకుని సేనాని అనే టైటిల్ తో కౌశల్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కబోతోందనే విషయం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.  'బిగ్ బాస్ 2' షోలో పాల్గొన్న కౌశల్ విజేతగా నిలవడమే కాకుండా, ఆ షో ద్వారా ఎంతోమంది  అభిమానుల ను  గెలుచుకున్నాడు.  సోషల్ మీడియా లో కౌశల్ ఆర్మి పేరుతో అప్పట్లో హంగామా గా ఉండేది. ఓ రేంజిలో క్రేజ్ వచ్చిన నేపధ్యంలో ఇప్పుడు ఆయన హీరోగా ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు. 

ఓ యంగ్ డైరక్టర్ వినిపించిన కథ నచ్చడంతో, హీరోగా చేయడానికి కౌశల్  గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం.అలాగే  ఈ సినిమాను నిర్మించడానికి మెగా క్యాంప్ తో సన్నిహిత సంభందాలు ఉన్న ఒక నిర్మాత సిద్ధంగా ఉన్నాడనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ఇక ఈ సినిమాకి 'సేనాని' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయట. 

ఇక ఈ చిత్రానికి ఈ టైటిల్ అనుకోవటానికి కారణం..పవన్ కళ్యాణ్ స్పూర్తి అంటున్నారు. సమకాలీన రాజకీయాల్లో పవన్ కల్యాణ్ పాత్ర ఆధారంగా ఈ సినిమా కొనసాగుతుందనే  టాక్  కూడా వినిపిస్తోంది.  

ఇక మోడలింగ్ నేపథ్యం కలిగిన కౌశల్ గతంలో కొన్ని టీవీ సీరియల్స్ లోను నటించాడు.  అలాగే కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించాడు. అంతేకాదు హీరో కావాలనేది తన లక్ష్యమని కొన్ని ఇంటర్వ్యూస్ లోను ఆయన చెప్పాడు. ఇప్పుడు ఆ సమయం వచ్చేసినట్టు అర్దమవుతోంది. బెస్టాఫ్ లక్ కౌశల్.