బిగ్ బాస్ సీజన్ 2 విజేతగా నిలిచిన కౌశల్ ప్రస్తుతం టీవీ షోలు, షాప్ ఓపెనింగ్స్ అంటూ కాస్త బిజీగానే గడుపుతున్నాడు. ఇటీవల ఆయన పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితం ఆధారంగా రాబోతున్న సినిమాలో నటిస్తున్నట్లు ప్రకటించారు.

ఈ సినిమాతో పాటు మరో సినిమాలో నటించే అవకాశం కూడా వచ్చినట్లు తెలుస్తోంది. అయితే సినిమాలో నటించడం కోసం కౌశల్ డిమాండ్ చేసిన కొన్ని విషయాలు మేకర్లను షాక్ కి గురి చేసినట్లు తెలుస్తోంది.

సినిమాలో హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలనే విషయంలో దర్శకనిర్మాతలు కౌశల్ ని సలహా అడగగా.. అతడు బాలీవుడ్ హీరోయిన్ ని తీసుకోవాలని చెప్పాడట. తనకున్న క్రేజ్ దృష్ట్యా అభిమానులు అతడి పక్కన స్టార్ హీరోయిన్ ఉండాలని కోరుకుంటారని, కాబట్టి బాలీవుడ్ స్టార్ హీరో లేక ఎవరైనా ఇంటర్నేషనల్ బ్యూటీని ప్రాజెక్ట్ లోకి తీసుకోవాలని చెప్పినట్లు సమాచారం. కౌశల్ డిమాండ్స్ విన్న మేకర్స్ కి బదులేం ఇవ్వాలో అర్ధంకాక సైలెంట్ గా ఉండిపోయారట.