Asianet News TeluguAsianet News Telugu

నాగబాబు 'జబర్దస్త్'లో జడ్జి కంటే పార్టిసిపెంట్ అయితే బాగుండేది: కత్తి మహేష్

సినీ ప్రముఖులతో పాటు రాజకీయనాయకులూ కూడా కత్తి మహేష్ పై ఫైర్ అయ్యారు. కానీ ఈ విషయంలో కత్తి మహేష్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. తనపై విమర్శలు గుప్పించిన నాగబాబుపై మండిపడ్డాడు. అతడిని ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు చేశాడు

katthi mahesh counter to nagababu

హిందువులు ఆరాధించే దైవం రాముడు, రామాయణంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా కత్తి మహేష్ పై హిందూ జనశక్తి నేతలు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కత్తి మహేష్ ను అరెస్ట్ చేయడం విచారించి కొన్ని హామీల మీద విడిచిపెట్టడం జరిగింది. ఈ విషయంపై స్పందించిన నాగబాబు.. కత్తి మహేష్ ను కఠినంగా శిక్షించాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సినీ ప్రముఖులతో పాటు రాజకీయనాయకులూ కూడా కత్తి మహేష్ పై ఫైర్ అయ్యారు. కానీ ఈ విషయంలో కత్తి మహేష్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. తనపై విమర్శలు గుప్పించిన నాగబాబుపై మండిపడ్డాడు. అతడిని ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు చేశాడు. 

''నాగబాబు గారు జబర్దస్త్ లో జడ్జిగాకన్నా పార్టిసిపెంట్ గా ఉంటే ఇంకా బాగుండేదని ఈరోజు ఒక వీడియో చూసి తెలుసుకున్నాను. టీవీల్లోకి వచ్చి ప్రతిఒక్కరూ బెదిరిస్తారు ఏమిటి స్వామీ!! తిరగనివ్వము. తీవ్రపరిణామాలు ఉంటాయి.చూసుకుంటాము. మేము తలుచుకుంటే ఏం జరుగుతుందో తెలీదు. స్వాములు. భక్తులు. ఈ రేంజి రౌడీలని నాకు తెలీదు. తెలుగు న్యూస్ టెలివిజన్ చరిత్రలో అత్యధిక బూతులు లైవ్ డిబేట్స్ లో తిని, ఇప్పటికి కూడా ఒక్క బూతు వాడని మనిషిని నేను.(ఎస్... దగుల్బాజీ బూతు కాదు). అయినా సరే, మూడు రోజుల నుంచి నేను ఒక నీచుడిని. మానసిక రోగిని.పబ్లిసిటీ పిచ్చి ఉన్నవాడిని. సభ్యసమాజంలో ఉండటానికి అనర్హుడిని.టెర్రరిస్టుని అని ఎందరో మహానుభావులు వాక్రుచ్చుచున్నారు. వీళ్ళని చూస్తోంటే నాకు జాలి వేస్తోంది. రేపటి నుంచీ నేను కొంచెం మారాలి ఏమో అనిపిస్తోంది'' అంటూ కామెంట్స్ చేశాడు. అలానే ఓ సినిమాలో వీడియో పోస్ట్ చేసి కేవలం అగ్ర కులాలకే దేవుడ్ని ప్రశ్నించే హక్కు ఉంటుందా..? దళితులకు ఆ హక్కు లేదా..? అంటూ ప్రశ్నించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios