Asianet News TeluguAsianet News Telugu

కౌశల్ ఆర్మీ అంటేనే హింస.. కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు!

బిగ్ బాస్ సీజన్2 మొదలైన దగ్గర నుండి సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. బిగ్ బాస్ కంటెస్టెంట్ కౌశల్ కోసం ఏకంగా కౌశల్ ఆర్మీ ఏర్పాటైంది. 

katthi mahesh comments on kaushal army
Author
Hyderabad, First Published Sep 14, 2018, 11:08 AM IST

బిగ్ బాస్ సీజన్2 మొదలైన దగ్గర నుండి సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. బిగ్ బాస్ కంటెస్టెంట్ కౌశల్ కోసం ఏకంగా కౌశల్ ఆర్మీ ఏర్పాటైంది. ఈ ఆర్మీ కౌశల్ ని ఎలిమినేషన్ నుండి కాపాడడం, అతడికి అత్యధిక ఓట్లు నమోదయ్యేలా చూడడం వంటివి చేస్తుంది.

గతంలో బాబు గోగినేని ఈ కౌశల్ ఆర్మీపై విరుచుకు పడ్డారు. తాజాగా సినీ విమర్శకుడు కత్తి మహేష్ కూడా ఈ ఆర్మీ పై స్పందించారు. ''అభిమానం ఉండొచ్చు కానీ దురభిమానం ఉండకూడదు. బిగ్ బాస్ కి వచ్చిన తరువాత అందరూ కుటుంబ సభ్యుల్లా మెలగాలి. హౌస్ మేట్స్ లో కొందరు కొందరికి నచ్చోచ్చు, నచ్చకపోవచ్చు అలా అని ట్రోల్ చేస్తారా..?. తమకి నచ్చని వారిపై కౌశల్ ఆర్మీ హేయమైన పదజాలంతో విమర్శించడం కరెక్ట్ కాదు.

కౌశల్ కి ఉన్నట్లే మిగిలిన కంటెస్టెంట్స్ కి కూడా కుటుంబాలు ఉంటాయి. వారికి ఈ ట్రోలింగ్ లు బాధ కలిగిస్తాయి. కౌశల్ ఆర్మీ అనే పదంలోనే హింస కనిపిస్తోంది. అసలు ఈ కౌశల్ ఆర్మీ ఎవరికి సైన్యం..? ఎవరి కోసం సైన్యం..? అనేది అర్ధం కావడం లేదు. ఎవరీ కౌశల్.. బహుశా ఆయన కొందరికి నచ్చి ఉండొచ్చు.. నాకు నచ్చలేదు అలాగని ట్రోల్ చేస్తారా..? ఇటీవల ఆయన పేరు మీద 2కె రన్ చేశారు.కేరళ వరద బాధితుల కోసం అలా చేసి ఉంటే సమాజానికి మంచి సంకేతాలు అంది ఉండేవి''  వెల్లడించారు. 

ఇవి కూడా చదవండి.. 

బిగ్ బాస్2: కౌశల్ పై గీతామాధురి భర్త సెటైర్లు.. మరోసారి కౌశల్, గీతాల మధ్య వేడి చర్చ!

బిగ్ బాస్2: తనీష్ తమ్ముడిపై కౌశల్ ఆర్మీ విమర్శలు!

బిగ్ బాస్2: కౌశల్ పై తనీష్ తమ్ముడు ఫైర్!

Follow Us:
Download App:
  • android
  • ios