కత్తి మహేష్ సొంత జిల్లాలో కూడా అరెస్ట్!

katthi mahesh arrested in chittoor
Highlights

 కత్తి మహేష్ పీలేరు ప్రాంతంలో ప్రెస్ మీట్ నిర్వహించి మీడియాతో మాట్లాడాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ తరువాత అక్కడ నుండి ఆయనను మదనపల్లెకు తరలించారు. 

శ్రీరాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ ను కఠినంగా శిక్షించాలంటూ హిందూ సంఘాలు ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం మరింత ముదిరిపోవడంతో తెలంగాణ పోలీసులు కత్తి మహేష్ ను హైదరాబాద్ నుండి బహిష్కరించారు.

ఆరు నెలల పాటు కత్తి మహేష్ ను తెలంగాణా నుండి బహిష్కరించిన పోలీసులు అతడిని ఆంధ్రప్రదేశ్ పోలీసులకు అప్పగించారు. చిత్తూరులోని ఆయన సొంతూరులో కత్తి మహేష్ ను పెట్టారు. అయితే అక్కడకు వెళ్లిన కత్తి మహేష్ పీలేరు ప్రాంతంలో ప్రెస్ మీట్ నిర్వహించి మీడియాతో మాట్లాడాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ తరువాత అక్కడ నుండి ఆయనను మదనపల్లెకు తరలించారు.

అక్కడ నుండి బెంగుళూరుకి తీసుకువెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే తనపై బహిష్కరణ విధించడం సబబు కాదని సోషల్ మీడియా వేదికగా కత్తి మహేష్ కామెంట్స్ చేస్తూనే ఉన్నారు.  

loader