ఉదయనిధి ధైర్యాన్ని మెచ్చుకుంటున్నా.. ఆయన స్పష్టంగా మాట్లాడారన్న కట్టప్ప, స్టాలిన్ కు పెరుగుతున్న మద్దతు
సనాతన ధర్మం గురించి తమిళనాడు మంత్రి.. సినీనటుడు, ముఖ్యమంత్రి తనయుడు ఉదయనిధి స్టాలిన్ (Udhyanithi Stalin) చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. చాలా మంది ఉదయనిధి వ్యాక్యలకు మండిపడుతుంటే.. కొంత మంది మాత్రం ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు. తాజాగా బాహుబలి కట్టప్ప ఆయనకు మద్దతుగా నిలిచారు.

ప్రస్తుతం తమిళ రాజకీయం సనాతన ధర్మం చుట్టు తిరుగుతుంది. డీఎంకే నేత, మంత్రి, సినీ నటుడు, నిర్మాత ఉదయనిధి స్టాలిన్ (Udhyanithi Stalin) సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నేరేపుతున్నాయి. సనాతన ధర్మం డెంగీ, మలేరియా లాంటిదని, దాన్ని నిర్మూలించాలని ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలు ఒక్క తమిళనాట మాత్రమే కాకుండా..దేశవ్యాప్తంగా మత, రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. స్టాలిన్ వ్యాఖ్యలపై బీజేపీ నుంచి తీవ్ర వ్యాతిరేకత రాగా.. మతపెద్దలు, అర్చక సంఘాలు, బ్రహ్మణసంగాలు సహా.. మరి కొన్ని పార్టీల నేతలు తీవ్ర విమర్శల దాడి చేస్తున్నారు.
అయితే ఇంత రచ్చ జరుగుతున్నా.. ఈ తను చేసిన వ్యాక్యల విషయంలో ఏమాత్రం తగ్గేది లేదంటున్నారు ఉదయనిధి స్టాలిన్. తన వ్యాఖ్యలను గట్టిగా సమర్ధిస్తూ.. తను మాట్లాడిన మాటల్లో తప్పులేదంటూ సమర్థించుకుంటున్నారు. ఈ క్రమంలో బాహుబలి కట్టప్పగా ఫేమస్ అయిన సత్యరాజ్ కూడా ఉదయనిధి స్టాలిన్ కు మద్దతు తెలిపారు.
ప్రముఖ నటుడు సత్యరాజ్ ఉదయనిధికి మద్దతుగా నిలిచారు. ఆయన మాటల్లో తప్పేముందని వ్యాఖ్యానించారు.సనాతన ధర్మంపై ఉదయనిధి స్పష్టంగా మాట్లాడారు. ఇంత ధైర్యంగా తన అభిప్రాయాలను వెల్లడించినందుకు అభినందిస్తున్నాను. ఓ మంత్రిగా ఉదయనిధి కార్యచరణ, వ్యవహార శైలి పట్ల గర్విస్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం కట్టప్ప కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సనాతన ధర్మం (Sanatana Dharma) డెంగీ, మలేరియా లాంటిదని, దాన్ని నిర్మూలించాలని తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) వాఖ్యానించారు. అప్పటి నుంచి ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. మంత్రి వ్యాఖ్యలపై పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఉదయనిధి మాత్రం తన వ్యాఖ్యలకు కట్టుబడే ఉన్నానని.. ఈ విషయంలో క్షమాపణలు చెప్పేదే లేదని తెగేసి చెబుతున్నారు.