బాహుబలి పార్ట్ వన్ చూసిన వారందరినీ వేధిస్తున్న ఒకే ఒక్క ప్రశ్న బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడని. ప్రభాస్ కూడా అందరూ తనను అదే ప్రశ్నను అడుగుతున్నారని అంటున్నాడు. ఓ వ్యక్తి అడిగితే బాహుబలి3 తర్వాతే అని చెప్పడంతో అతని గుండె ఆగినంత పనైందట. బాహుబలి-2లో చిత్రంలో ఉన్న ప్రధాన ఆకర్షణల్లో భల్లాలతో బాహుబలి ఫైటింగ్ ఒకటి అని యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చెప్పాడు. అయితే బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనేదానిపై ఎవరూ చెప్పకున్నా తాజాగా ఓ వివరణ తెగ ట్రెండ్ అవుతోంది.

 

సినిమాలో దేవసేనను ప్రేమించిన బాహుబలి శివగామి షరతు మూలంగా రాజ్యమా, ప్రేమా అని అడగటంతో ప్రేమ కోసం రాజ్యం వదులుకుంటాడట బాహుబలి. అప్పుడు రాజుగా భల్లాలుడు పట్టాభిషిక్తుడై... అరాచకాలు చేస్తూంటాడట. అయితే... రాజులకు కట్టు బానిసగా ఉండాల్సిన కట్టప్ప వంశాచారం ప్రకారం రాజు భల్లాలుని ఆదేశాల మేరకు పనిచేస్తూ ఉంటాడట. కానీ రాజు అరాచకాలు ఎక్కువవటం... తన కోరిక తీరలేదనే అహంతో... బాహుబలి సతీమణి అనుష్కను భల్లాలుడు చెరబట్టేందుకు ప్రయత్నిస్తాడట. దాంతో ఆగ్రహోద్రిక్తుడైన బాహు భల్లాలుని అంతమొందించేందుకు కత్తి కడతాడట. అలా ఇరువురి మధ్య అది భీకర పోరుకు దారితీయడం.. అప్పుడు నిండు గర్భవతి అయిన దేవసేన(అనుష్క)ను భల్లాలుడు బందీ చేయడం... దేవసేన మెడపై కత్తిపెట్టి బాహుబలిని చంపాలని కట్టప్పను ఆదేశించడంతో... ఆ ఫైట్ లోనే భల్లాలునికి బానిసగా ఉండే కట్టప్ప బాహుబలిని చంపేస్తాడట. రాజులకు విధేయుడిగా ఉండాల్సి రావటంతో కట్టప్ప భల్లాలుడి దగ్గరే కాలం వెల్లదీస్తాడట. ఇరువురి మధ్య రాజ్యం, ప్రేమ పంపకం జరిగాక తిరిగి రాజ్యాధికారం చేతిలో ఉంది కదా అని భల్లాలుడు నిండు గర్భిని పట్ల దుర్మార్గంగా ప్రవర్తించడం తల్లిగా శివగామికి నచ్చకనే.. జూనియర్ బాహుబలిని రక్షిస్తుందట. ఇలా కొత్త స్టోరీ రౌండ్స్ చేస్తోంది.

 

ఇక బాహుబలి తర్వాత ఎక్కడికెళ్లినా అంతా గుర్తు పట్టేస్తున్నారని ప్రభాస్ తెలిపాడు. ముంబై, ఢిల్లీకి వెళితే అందరూ నన్ను గుర్తుపట్టేస్తున్నారు. నాతో ఫొటోలు దిగేందుకు ఆరాటపడుతున్నారు. టుస్సాడ్స్ మ్యూజియంలో నా మైనపు బొమ్మను పెట్టాలనుకుంటున్నారన్న ప్రతిపాదనను నా మిత్రుడు చెప్పగా నమ్మలేకపోయాను. దాదాపు ఒక్క రోజు దాకా నేను సాధారణ పరిస్థితికి రాలేకపోయాను. బాహుబలి సినిమా విజయంతో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఆ సక్సెస్‌ను నెత్తికెక్కించుకున్నామంటే వెంటనే కిందికి పడిపోవడం ఖాయం. అందుకే విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నానంతే. ఇక, హిందీ సినిమాల గురించి ఇప్పడేమీ అనుకోలేదు. నాకు చాలా ఆలోచనలున్నాయి. రెండు నెలల తర్వాత ఏంటనేది చెప్తాను' అని వెల్లడించాడు.

 

‘వివాహం ఎప్పుడన్నది నా చేతుల్లో లేదు. దానికి కరెక్ట్ సమాధానం నా వద్ద దొరకదు. సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలను మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తాను‘ అని బాహుబలి తెలిపారు.