అమీర్ ఖాన్ మాటలు తనను బాధించాయంటోంది కత్రినా కైఫ్. ఆయన తన తాజా చిత్రం థగ్స్ ఆఫ్ హిందూ స్దాన్ ప్లాఫ్ అయిన నేపధ్యంలో తనే భాధ్యత వహిస్తానంటూ ప్రకటించారు. ఈ విషయం కత్రినా కైఫ్ ని చాలా బాధపెట్టిందిట. సినిమా అనేది సమిష్టి కృషి అయినప్పుడు ఆయన ఒక్కరే పరాజయ భారాన్ని మోస్తాననటం తను తట్టుకోలేకపోయానంటోంది. 

అమితాబ్‌ బచ్చన్‌, ఆమీర్‌ఖాన్‌, కత్రినా కీలక పాత్రల్లో నటించిన భారీ బడ్జెట్‌ చిత్రం ‘థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌’. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద అపజయాన్ని మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో చిత్రం పరాజయం పాలవడం పట్ల తాను పూర్తి బాధ్యత వహిస్తానని ఆమీర్‌ఖాన్‌ కూడా అన్నారు.

ఈ విషయమై కత్రినా మాట్లాడుతూ.. ‘‘ఈ విషయంలో ఆమీర్‌ఖాన్‌ మాట్లాడింది నాకు తెలుసు. అది నన్ను తీవ్రంగా బాధించింది. అయితే, డిజప్పాయింట్మెంట్ కూడా కొన్నిసార్లు మంచిదే. ఎందుకంటే అది మనకు మేలుకొలుపులాంటింది. ముఖ్యంగా ‘థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌’ విషయంలో. మా ప్రయత్నంలో ఎలాంటి లోపం లేదు. కొన్ని సార్లు అలా జరుగుతుంది. ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొనేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి’’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది బార్బీడాల్‌ క్రతినాకైఫ్‌. 

కాగా  కత్రినా కీలక పాత్రలో నటించిన ‘జీరో’ చిత్రం ఈనెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో షారుక్‌ఖాన్‌ మరుగుజ్జు పాత్రలో అలరించనున్నారు. ఆనంద్‌ ఎల్‌రాయ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. 

ఈ చిత్రం గురించి మాట్లాడుతూ.. ‘ఒక సినిమా హిట్ అవుతుందా? లేదా? అన్నది ఎవరూ ముందే చెప్పలేరు. దానికోసం ఎంతో కష్ట పడాల్సి ఉంటుంది. ‘జీరో’ ఓ మంచి చిత్రం. మంచి కథ ఉంది. మన చిత్ర పరిశ్రమలో ఉన్న దర్శకుల్లో ఆనంద్‌ ఎల్‌. రాయ్‌ మంచి కథకుడు. ప్రేక్షకులకు కచ్చితంగా చేరవవుతుంది. ఎమోషన్స్ ని బాగా పండిస్తారు. సినిమా రిలీజ్ అయ్యే వరకూ వేచి చూడండి. ఆన్సర్ మీకే దొరుకుతుంది’’ అని తెలిపింది.