Asianet News TeluguAsianet News Telugu

గడాఫీతో కత్రీనా కైఫ్- పదిహేనేళ్ల క్రితమే.. ఫోటో లీక్-వైరల్

  • లిబియా నియంత గడాఫీతో కత్రీనా కైఫ్
  • ఓ ఫ్యాషన్ షో కోసం వెళ్లి గడాఫీతో ఫోటోలు
  • తాజాగా లీక్ అయి వైరల్ అవుతున్న కత్రినా-గడాఫీ ఫోటో
katrina picture with late gadafi posted by shamitha singhal

తన అందంతో, అభినయంతో బాలీవుడ్‌ ప్రేక్షకులను ఆకట్టుకున్న కత్రినాకైఫ్ టాప్ రేసులో దూసుకెళ్తోంది. తెలుగులోనూ కొన్ని సినిమాల్లో నటించి మెప్పించిన కత్రీనా... ప్రపంచ దేశాలన్నీ చర్చించుకున్న ఓ నియంతతో దిగిన ఫొటో ఇప్పుడు ఇంటర్నెట్‌ను కుదిపేస్తోంది. అమెరికా దాడుల్లో హతమైన కరుడుగట్టిన నియంత గడాఫీ పక్కన.. కత్రినా మోకాళ్లపై కూర్చుని ఉన్న ఫొటో సోషల్‌మీడయాలో వైరల్‌గా మారింది.

 

సినిమాల్లోకి రాకముందు కత్రినా కైఫ్ మోడల్‌గా పనిచేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే లిబియాలో నిర్వహించిన ఓ ఫ్యాషన్‌ షోలో కత్రినా పాల్గొంది. ఆ సందర్భంగా లిబియా నియంత గడాఫీతో కలిసి పలువురు మోడల్స్ ఫొటోలకు ఫోజులిచ్చారు. అలా గడాఫీతో ఫొటో దిగినవారిలో కత్రినా కూడా ఉంది. ఆ ఫ్యాషన్ షో జరిగి 15 ఏళ్లు పూర్తయిన సందర్భంగా షమితాసింఘా అనే మోడల్ ఇన్‌స్టాగ్రామ్‌లో గ్రూప్ ఫొటోను పోస్ట్ చేసింది.

 

‘లిబియాలో జరిగిన ఫ్యాషన్ షోలో మనం పాల్గొని 15 ఏళ్లు పూర్తయ్యాయి. అప్పుడు గడాఫీని కలిసే అవకాశం వచ్చింది. ఈ ట్రిప్ గుర్తుందా?’ అంటూ తన సహచర మోడల్స్‌ను ఆమె ప్రశ్నించింది. ఆ ఫొటోలో కత్రినాతో పాటు నేహాధుపియా, అదితి గోవిత్రికర్, అంచల్ కుమార్ తదితర టాప్ మోడల్స్ వున్నారు.

 

అయితే ఈ ఫోటో వివాదాస్పదమవుతోందని, వైరల్ కాక ముందే తీసేయాలని భావించి ప్రస్థుతం ఇన్ స్టా గ్రామ్ నుంచి తొలగించింది. ఏదేమైనా ఇలాంటి ఓ పిక్ బయటపడటం మాత్రం అరుదైన విషయమే. కాదు అత్యంత అరుదైన విషయమే.

Follow Us:
Download App:
  • android
  • ios