Asianet News TeluguAsianet News Telugu

కపిల్ భార్యగా కత్రినా

  • కపిల్ దేవ్ జీవిత కథ ఆధారంగా బాలీవుడ్ చిత్రం 83
  • కపిల్ దేవ్ పాత్రలో రణవీర్ సింగ్
  • కపిల్ దేవ్ భార్య పాత్రలో కత్రినా కైఫ్
katrina Kaif to play Ranveer Singhs romantic interest in Kabir Khans 83

లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ జీవిత కథ ఆధారంగా బాలీవుడ్ లో ఓ సినిమా తెరకెక్కుతోంది. 1983వ సంవత్సరంలో తొలిసారిగా కపిల్ దేవ్ కెప్టెన్సీలో  భారత్ వరల్డ్ కప్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘83‘ పేరిట సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో కపిల్ దేవ్ పాత్రలో రణవీర్ సింగ్ నటిస్తున్నారు.

 

ప్రముఖ దర్శకుడు కబీర్ ఖాన్  దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర టైటిల్ లోగోను ఇటీవలే ముంబయిలో ఆవిష్కరించారు. ఇక కపిల్ దేవ్ భార్య రోమి దేవి పాత్రలో కత్రినాకైఫ్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కబీర్ దర్శకత్వంలో కత్రినా.. మూడు సినిమాల్లో నటించింది. తాజాగా ఈ సినిమాలోనూ కత్రినానే ఎంచుకున్నట్లు సమాచారం. రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫాంటమ్ ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios