అందాల మెరుపు తీగ కత్రినా కైఫ్ ఇప్పటికీ బాలీవుడ్ ని కుదిపేస్తోంది. యువ హీరోయిన్లకు ధీటుగా దూసుకుపోతోంది. ఇటీవల కత్రినాకు థగ్స్ ఆఫ్ హిందుస్తాన్, జీరో రూపంలో భారీ డిజాస్టర్లు ఎదురయ్యాయి. అయినా కూడా కత్రినా జోరు తగ్గడం లేదు. త్వరలో సల్మాన్ ఖాన్ సరసన మరోమారు నటించిన భారత్ చిత్రంతో మెప్పించేందుకు సిద్ధం అవుతోంది. కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రియురాళ్ల జాబితాలో చాలా మందే హీరోయిన్లు ఉన్నారు. 

గతంలో సల్మాన్, కత్రినా మధ్య ఘాటు ఎఫైర్ సాగినట్లు వార్తలు ఉన్నాయి. తాజాగా కత్రినా కైఫ్, సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకుకోవాలని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ నుంచి డిమాండ్స్ కూడా వినిపిస్తున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పెళ్లి గురించి ప్రస్తావించగా కత్రినా ఎమోషనల్ గా కొన్ని వ్యాఖ్యలు చేసింది. 

నా చిన్నతనంలోనే మా అమ్మానాన్న విభేదాలతో విడిపోయారు. తండ్రి లేకుండా పెరిగాను. ఎవరితోనూ పెద్దగా మాట్లాడేదాన్ని కాదు. లాంటిది ఇప్పుడు నటిగా రాణిస్తున్నాను అంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. ఇక పెళ్లి గురించి ఆలోచించినప్పుడల్లా నా బాల్యమే గుర్తొస్తుంది. నాలాగా నా పిల్లలు తండ్రి దగ్గర లేకుండా పెరగకూడదు. తల్లిదండ్రుల మధ్య ప్రేమానురాగాలతో వాళ్ళు పెరగాలి అని కత్రినా తెలిపింది. 

అలాగని తండ్రి లేనంత మాత్రాన జీవితంలో సర్వం కోల్పోయినట్లు కాదు. నేను ఏడుగురు తోబుట్టువుల మధ్య తండ్రి లేకుండానే పెరిగానని కత్రినా గుర్తు చేసింది.భారత్ చిత్రం జూన్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.