బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ తనకి లిప్ కిస్ పెట్టినందుకు అతడు చాలా అదృష్టవంతుడని అంటోంది కత్రినా కైఫ్. హీరోగా ఎన్నో సినిమాల్లో నటించిన షారుఖ్ లిప్ లాక్ సన్నివేశాలను చాలా దూరం.

బాలీవుడ్ లో తొంబైలలోనే లిప్ లాక్ సీన్స్ హల్చల్ చేసేవి. థియేటర్లలో జనాలను ఆకట్టుకునేవి. హీరో, హీరోయిన్లు ఇటువంటి సన్నివేశాల్లో నటించడానికి పెద్దగా అభ్యంతరాలు పెట్టేవారు కాదు. కానీ షారుఖ్ మాత్రం ఏ హీరోయిన్ ని ముద్దాడలేదు. చాలా కాలం తరువాత యష్ చోప్రా వంటి దర్శకుడు షారుఖ్ తో లిప్ కిస్ పెట్టించాడు.

'జబ్ తక్ హే జాన్' సినిమాలో కత్రినా కైఫ్ కి షారుఖ్ కు మధ్య లిప్ లాక్ సీన్ ప్లాన్ చేశాడు. ఇక తప్పక షారుఖ్ ఆ సన్నివేశాల్లో నటించాడు. ఇప్పుడు మళ్లీ ఈ ఇద్దరూ కలిసి 'జీరో' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలో కత్రినాకి పాత ముద్దుకి సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి.

'తొలిసారి షారుఖ్ తెరపై ముద్దు పెట్టుకున్న హీరోయిన్ నువ్వే కదా.. దీన్ని అదృష్టంగా భావిస్తున్నావా' అని ప్రశ్నించగా.. దానికి కత్రినా.. 'మొదటిసారి షారుఖ్ తెరపై లిప్ కిస్ పెట్టినందుకు నేనేం లక్కీ అనుకోవడం లేదు. నన్ను అలా ముద్దు పెట్టుకున్నందుకు షారుఖే లక్కీ ఫెలో' అంటూ సమాధానమిచ్చింది. కత్రినా గడుసు సమాధానికి అక్కడున్న వారంతా సైలెంట్ అయిపోయారు.