కత్రినా కైఫ్ చివరగా నటించిన చిత్రం భారత్. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ఈ చిత్రం పర్వాలేదనిపించింది. ఇక కత్రినా కైఫ్, సల్మాన్ ఖాన్ రిలేషన్ గురించి చాలా రోజులుగా బాలీవుడ్ లో ఊహాగానాలు ఉన్న సంగతి తెలిసిందే. కత్రినా బాలీవుడ్ కు వెళ్లిన కొత్తల్లో సల్మాన్ ప్రేమలో పడింది అంటూ వార్తలు వచ్చాయి. ఆ తర్వాత రణబీర్ కపూర్ తో సహజీవనం చేసింది. 

వారిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫోటోలు కూడా అప్పట్లో హాట్ టాపిక్ గా మారాయి. ఇక 2017లో ఈ జంట విడిపోయింది. దీనితో కత్రినా కైఫ్ మరోసారి సల్మాన్ ఖాన్ చేరువైనట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా సింగపూర్ కు ఓ కార్యక్రమం కోసం వెళ్లిన కత్రినా సల్మాన్ ఖాన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 

సల్మాన్ ఖాన్ తో నాది చాలా ప్రత్యేకమైన అనుబంధం. బాలీవుడ్ లో నేను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా. నన్ను ఎవరూ పట్టించుకోలేదు. ఆ సమయంలో నన్ను ఆదుకున్న ఏకైన వ్యక్తి సల్మాన్ ఖాన్ అని కత్రినా తెలిపింది. అప్పటి నుంచి ప్రతి సమస్యలో సల్మాన్ నాకు అండగా నిలిచారు. ఇతరుల కష్టాలని అర్థం చేసుకుని సాయం చేసే మనస్తత్వం ఆయనది అంటూ సల్మాన్ ని ఒక రేంజ్ లో కత్రినా ఆకాశానికి ఎత్తేసింది. ఈ కొత్త పొగడ్తల వెనుక మర్మం ఏమిటో!