'భారత్' సినిమా రిలీజ్ దగ్గర పడుతుండడంతో సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందోననే కారణంతో తనకు నిద్ర కూడా పట్టడం లేదని అంటోంది నటి కత్రినా కైఫ్. సల్మాన్, కత్రినా జంటగా నటించిన 'భారత్' సినిమాకు అల్లు అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించారు. 

కొరియన్ సినిమా 'ఓడ్‌ టు మై ఫాదర్‌' చిత్రానికి రీమేక్ గా 'భారత్' ని తెరకెక్కించారు. ఇందులో సల్మాన్ ఖాన్ 18 ఏళ్ల యువకుడి నుండి 70 ఏళ్ల వృద్ధుడి వరకు డిఫరెంట్ గెటప్ లలో కనిపించనున్నారు. ఈ సినిమా కోసం సల్మాన్, కత్రినాలు ఎంతో కష్టపడినట్లు ఇంటర్వ్యూలలో చెప్పారు.

ఈ క్రమంలో సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో తెలుసుకోవాలని చాలా ఆతురతగా ఉందని చెప్పింది కత్రినా. 'భారత్' విషయంలో ఎంతో ఎగ్జైటెడ్ గా ఉన్నట్లు, దీని కారణంగా నిద్ర లేని రాత్రులు గడుపుతున్నానంటూ చెప్పుకొచ్చింది.

సినిమాను ప్రజలకు తొందరగా చూపించాలనుందని, వారి రెస్పాన్స్ తెలుసుకోవాలనుందని తెలిపింది. సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంతో కలెక్ట్ చేస్తుందో.. ముందే ఊహించడం కష్టమైన పని అని.. ఎప్పటిలానే ప్రేక్షుల ప్రేమాభిమానాలు తమకు దక్కుతాయని ఆశిస్తున్నట్లు చెప్పింది.