ప్రస్తుతం బాలీవుడ్ లో పెళ్లిల్ల సీజన్ నడుస్తోంది. అనుష్క శర్మ, నేహా ధుపియా, సోనమ్, దీపిక రీసెంట్ గా ప్రియాంక ఇలా చాలా మంది పెళ్లి చేసుకొని కపుల్ గోల్స్ సెట్ చేస్తున్నారు. తాజాగా హీరోయిన్ కత్రినా కైఫ్ కూడా పెళ్లి గురించి తన మనసులో మాటను ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

''కొద్దిరోజులుగా నా మనసులో కూడా ఇదే విషయం తిరుగుతుంది. అయితే ఈ విషయాన్ని నేను దేవుడికే వదిలేస్తున్నాను. జీవితంలో మనకు ఏది రాసిపెట్టి ఉంటుందో అదే జరుగుతుంది.

మనకు ఏదైతే నిర్ధారితమై ఉంటుందో అదే చేస్తుంటాం. ఈ విషయం గ్రహించిన తరువాత ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను. మనకు వచ్చిన ఆలోచనలన్నీ సాకారం కావు'' అంటూ తెలిపింది. గతంలో కత్రినా స్టార్ హీరో రణబీర్ కపూర్ తో ప్రేమాయణం నడిపించింది.

కొంతకాలం పాటు వీరు సహజీవనం కూడా చేశారు. కానీ ఆ తరువాత బ్రేకప్ అవ్వడంతో ఒకరికొకరు దూరమయ్యారు. ప్రస్తుతం రణబీర్.. అలియా భట్ తో డేటింగ్ లో ఉన్నాడని  టాక్. కానీ కత్రినా మాత్రం సింగిల్ గానే ఉంటోంది.