దర్శకుడు బలవంతం మీద సినిమాలో నటించానని చెబుతోంది స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్. మొదట 'జీరో' సినిమా కథ విన్నప్పుడు నటించాలని అనుకోలేదని కానీ డైరెక్టర్ ఫోర్స్ చేయడంతో ఒప్పుకున్నానని అంటోంది.

సాధారణంగా హీరోయిన్లు తాము నటించిన సినిమా గురించి ప్రమోషన్స్ సమయంలో చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటారు. కానీ కత్రినా మాత్రం దీనికి విరుద్ధంగా కామెంట్స్ చేసి ఆశ్చర్యపరిచింది. షారుఖ్ ఖాన్ హీరోగా అనుష్క శర్మ, కత్రినా కైఫ్ హీరోయిన్లుగా దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ 'జీరో' అనే సినిమాను రూపొందించాడు. 

ఈ సినిమాలో కత్రినా తాగుడికి బానిసైన ఓ అమ్మాయి పాత్రలో కనిపించనుంది. పైగా ఆమె పాత్ర అరగంట పాటు మాత్రమే తెరపై కనిపిస్తుందట. అందుకే ఈ సినిమాలో నటించడానికి కత్రినా ఆసక్తి చూపలేదట.

ఈ విషయాలను కత్రినా స్వయంగా వెల్లడించింది. తనకు సినిమాలో నటించడం ఇష్టం లేకపోయినా.. దర్శకుడు బలవంతం చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అంగీకరించాల్సి వచ్చిందని వెల్లడించింది.