Asianet News TeluguAsianet News Telugu

అలా హిరోయిన్ పృష్ఠ భాగం మీద చేత్తో చరవటం.. సాయిధరమ్ తేజ్ పై కత్తి విమర్శలు

  • సాయి ధరమ్ తేజ్ హీరోగా వస్తోన్న ఇంటిలిజెంట్
  • వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ
  •  ఈ మూవీలో హిరోయిన్ లావణ్య త్రిపాఠి
  • ఈ మూవీలో మెగాస్టార్ ఇమిటేషన్ పై కత్తి మహేష్ విమర్శలు
kathi mahesh tweets against saidharamtej act in inttelligent

హీరోయిన్లు ప్రంటూ బ్యాకూ తేడా లేకుండా రఫ్పాడించడం, నడుము గిల్లడం, వాళ్ల 'బ్యాక్'పై ఓ దెబ్బ చరిచి.. అలా ఓ రొమాంటిక్ లుక్కేయడం మెగాస్టార్ చిరంజీవి నైంటీస్ లో సెట్ చేసిన ఓ ట్రెండ్. అయితే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు.. మేనమామ పాటల్ని రీమేక్ చేసినట్లుగానే ఆయన మేనరిజమ్స్ కూడా పట్టేద్దామనుకుంటున్నాడో తెలియదు గానీ.. ఒకప్పటి ఆ ట్రెండ్‌ను ఇప్పుడు ఫాలో అవుతున్నాడు హీరో సాయిధరమ్ తేజ్. ఆ ట్రెండ్‌పై ఫిలిం క్రిటిక్ కత్తి సంధించిన విమర్శ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

 

'ఇంటిలిజెంట్' సినిమా విడుదల దగ్గరపడుతుండటంతో ప్రమోషన్ లో భాగంగా తాజాగా ఒక పోస్టర్ విడుదల చేశారు. ఇందులో హీరోయిన్ లావణ్య త్రిపాఠి 'బ్యాక్'పై హీరో సాయిధరమ్ తేజ్ తన రైట్ హ్యాండ్‌తో ఓ దెబ్బ చరిచినట్లుగా కనిపిస్తోంది. ఈ పోస్టర్ పై క్రిటిక్ కత్తి మహేష్ తనదైన శైలిలో కామెంట్ చేశారు. 'అలా... హీరోయిన్ పృష్ఠ భాగం మీద చేత్తో చరిచి, చిలిపిగా తెరవైపు చూసి, ప్రేక్షకులకి కన్నుకొట్టడం చిరంజీవి గారి అరుదైన 90s స్టైల్. ఇమిటేషన్ వరకు ఒకే, కానీ ఇప్పటికీ ఇలా చెయ్యడం అవసరమా!' అంటూ ట్విట్టర్‌లో తన విమర్శను సంధించారు.

 

చిరంజీవి లా మాస్ ఇమేజ్ కోసం ఆరాటపడుతున్న సాయిధరమ్ తేజ్.. బాడీ లాంగ్వేజ్ దగ్గరి నుంచి, మేనరిజమ్స్ వరకు ఆయన్నే ఫాలో అవుతున్నట్లుగా అర్థమవుతోంది. తాజా పోస్టర్ లోనూ ఇదే విషయం స్పష్టమైంది. చిరంజీవికే ప్రత్యేకమైన స్టైల్స్, మేనరిజమ్స్ ఇమిటేట్ చేయడం ద్వారా సాయిధరమ్ తేజ్ కంటూ సొంత మార్క్ అనేది లేకుండా పోతుందనేది మరికొందరి అభిప్రాయం. చాలామంది హీరోలు వైవిధ్యమైన కథలతో కెరీర్ ను ప్లాన్ చేసుకుంటుంటే.. సాయిధరమ్ మాత్రం అనవసరంగా మాస్ ఇమేజ్ కోసం పాకులాడి రాంగ్ ట్రాక్‌లో వెళ్తున్నాడనే అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది.

 

ఇక కత్తి విషయానికొస్తే.. 'ఇంటిలిజెంట్'పై గతంలోనూ ఆయన విమర్శనాస్త్రాలు సంధించారు. ఫస్ట్ లుక్ లో భాగంగా విడుదల చేసిన పోస్టర్ పై ఆయన పెదవి విరిచారు. 'తెలివైనవాడు గన్ పట్టుకోవడమేంటో.. టైటిల్‌కి తగ్గ పోస్టర్ అయితే కాదు' అని కొద్ది రోజుల క్రితం కామెంట్ చేశారు.

 

ఇక వరుణ్ తేజ్ 'తొలిప్రేమ' భీమవరంలో ప్రీరిలీజ్ ఈవెంట్ జరుపుకుంటే.. 'ఇంటిలిజెంట్' రాజమండ్రిలో ప్రీరిలీజ్ ఈవెంట్ జరుపుకోవడం విశేషం. తొలిప్రేమ ప్రీరిలీజ్ వేడుకలో మాట్లాడుతూ.. తేజు బాబు 'ఇంటిలిజెంట్' సినిమాను కూడా చూడాలని అభిమానులకు వరుణ్ తేజ్ విన్నవించారు. ఒకరి సినిమాను మరొకరు ఈ మెగాహీరోలు భలే ప్రమోట్ చేసుకుంటున్నారనే చెప్పాలి.

Follow Us:
Download App:
  • android
  • ios